Site icon vidhaatha

Indian Embassy | డిగ్రీ అర్హతతో ఇండియన్‌ ఎంబసీలో ఉద్యోగం.. నెలకు రూ.1.25 లక్షల జీతం..!

indian-embassy

Indian Embassy : డిగ్రీ అర్హతతో భారత రాయబార కార్యాలయం (ఇండియన్‌ ఎంబసీ) లో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్‌ ఎంబసీ ఒక నోటీసును ప్రచురించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతోపాటు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ప్రావీణ్యంతోపాటు 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ఏదైనా గుర్తింపు ఉన్న సంస్థ లేదా కార్యాలయంలో క్లర్క్‌గా కనీసం మూడేళ్లపాటు పనిచేసి ఉండాలి. అరబిక్‌లో ప్రావీణ్యం కలిగిన వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు తమ అదనపు అర్హతలు, పని అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్లికేషన్‌లో చూపాలి.

ఈ ఉద్యోగంలో చేరిన వారికి అన్ని అలవెన్సులతో కలిపి నెలవారీ జీతం 5,500 ఖతార్ రియాల్స్ వస్తుంది. అంటే ఇండియన్‌ కరెన్సీలో అది సుమారు రూ. 1.25 లక్షలు. చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న అభ్యర్థులు 2024 ఏప్రిల్ 7 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పంపడానికి ప్రచురించిన నోటీసులో చిరునామాతోపాటు ఇండియన్‌ ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో లింక్ అందుబాటులో ఉంది.

 

Exit mobile version