Site icon vidhaatha

Indian Railway | రైలు టికెట్‌ బుకింగ్‌ టైంలో ఈ పని చేస్తే చాలు..! స్లీపర్‌ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం చేయొచ్చు..!

Indian Railway | దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ భారతీయ రైల్వే. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను రైల్వే గమ్యస్థానాలకు చేరుతున్నది. రైలులో ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు ప్రయాణికులకు భద్రత ఉంటుంది. దీంతో ఎక్కువ మంది రైలులోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, రైలులో ప్రయాణించేందుకు అడ్వాన్స్‌ టికెటింగ్‌ బుకింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. కేటగిరిల వారీగా టికెట్లు అందుబాటులో ఉంటాయి.

రైలు ఏసీ, స్లీపర్‌, జనరల్‌ బోగీలుంటాయి. అయితే, ప్రయాణ సమయంలో స్లీపర్‌ కోచ్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు.. ఏసీ కోచ్‌లలో ప్రయాణించే అవకాశం భారతీయ రైల్వే కల్పిస్తున్నది. అదనంగా ఒక్కరూపాయి చెల్లించకుండానే ఈ అవకాశం ఇస్తున్నది. స్లీపర్‌ కోచ్‌లో టికెట్‌ బుక్‌ చేసిన ప్రయాణికులు.. ఏసీ కోచ్‌లోకి వెళ్లేందుకు తప్పనిసరిగా ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌ సమయంలో ‘ఆటో అప్‌గ్రేడ్‌’ ఆప్షన్‌ని క్లిక్‌ చేయాలి. టికెట్ బుకింగ్‌ సమయంలోనే ఆటో అప్‌డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తేనే.. స్లిపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

ఏదైనా స్లీపర్ క్లాస్ మాత్రమే కాదు.. థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీలో ఎందులో బెర్త్‌లు ఖాళీగా ఉంటే.. అందులో ప్రయాణికులకు టికెట్‌ ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్‌ అవుతుంది. ఆటో అప్‌గ్రేడ్ ఆప్షన్‌ను ఎంచుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నది రైల్వేశాఖ. విమానాల్లో ఎకానమీ నుంచి బిజినెస్ క్లాస్‌కు టికెట్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో రైలులోనూ స్లీపర్‌ కోచ్‌ నుంచి ఏసీ కోచ్‌కు టికెట్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నది భారతీయ రైల్వే.

Exit mobile version