Train Berth Rules | దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ భారత రైల్వే. సుదూర ప్రాంతాలకు వారంతా రైలులోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, రైల్వే ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తూ వస్తున్నది. అయితే, చాలామందికి రైలులో ప్రయాణించే సమయంలో పాటించాల్ని నిబంధనల గురించి అవగాహన ఉండడం లేదు. ప్రయాణికులు మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
అయితే, ఎక్కువ సేపు మిడిల్ బెర్త్‌ను ఉపయోగించడం వల్ల లోయర్ బెర్త్‌లో కూర్చునే ప్రయాణికులు ఇబ్బందులుపడుతుంటారు. అయితే, తాజాగా మిడిల్ బెర్తుల నిబంధనలను రైల్వేశాఖ మార్చింది. కొత్త రూల్స్ ప్రకారం.. గతంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అవకాశం ఉండగా.. దీన్ని ఇకపై 10 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే మిడిల్ బెర్తును వాడుకునేలా మార్చింది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ మార్పులు చేసింది. మిడిల్ బెర్త్‌లపై పడుకునే వారంతా ఎక్కువగా సమయం పాటు వాటిని వాడుకుంటున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి.
దీంతో లోయర్ బెర్తుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బెర్తుల విషయంలో ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే, ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్ర కోసం మిడిల్ బెర్త్‌ను ఉపయోగించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత లోయర్ బెర్తులో సీట్‌లో కూర్చోవాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకునేందుకు అవకాశాలు సైతం ఉటాయి. ఎవరైనా మిడిల్ బెర్తుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తే రైలులోని అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.