Video Viral | ప‌ట్ట‌ప‌గ‌లే.. క‌దులుతున్న బస్సులో ప్రేమ జంట ముద్దులు, కౌగిలింత‌లు.. వీడియో

ఇటీవ‌లి కాలంలో ప్రేమికుల ఆగ‌డాలు శృతి మించిపోతున్నాయి. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ప‌ట్ట‌ప‌గ‌లే బ‌హిరంగంగా రొమాన్స్‌లో మునిగిపోతున్నారు

  • Publish Date - May 13, 2024 / 06:45 PM IST

భువ‌నేశ్వ‌ర్ : ఇటీవ‌లి కాలంలో ప్రేమికుల ఆగ‌డాలు శృతి మించిపోతున్నాయి. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ప‌ట్ట‌ప‌గ‌లే బ‌హిరంగంగా రొమాన్స్‌లో మునిగిపోతున్నారు. లిప్ లాక్స్, కౌగిలింత‌ల్లో ఒదిగిపోయి ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. క‌దులుతున్న ఓ ఆర్టీసీ బ‌స్సులో ఓ ప్రేమ‌జంట రొమాన్స్‌లో మునిగి తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఒడిశాలోని రూర్కేలాలో క్యాపిట‌ల్ రిజీయ‌న్ అర్బ‌న్ ట్రాన్స్‌పోర్టు బ‌స్సులో ఓ ప్రేమ జంట ఎక్కింది. అదేదో మ‌ధ్య సీట్లో కూర్చోకుండా, బ‌స్సు కార్న‌ర్ సీట్లో చివ‌ర‌న కూర్చున్నారు. ఇక ఇద్ద‌రు వేర్వేరు సీట్ల‌లో కూర్చున్నారా..? అంటే అది కూడా లేదు. త‌న ప్రేమికుడి ఒళ్లో ప్రియురాలి కూర్చొని ఎంజాయ్ చేసింది. ప్రియుడు ఆమెను ముద్దులు, కౌగిలింత‌ల‌తో ప్రేమ‌ను కురిపించాడు. ఆ యువ‌తి కూడా రొమాన్స్‌ను తెగ ఎంజాయ్ చేసింది.

బ‌స్సులో జ‌నాలు ఉన్నార‌ని కూడా మ‌రిచిపోయి వారిద్ద‌రూ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ప్రియురాలిని తాక‌రాని చోట తాకి ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగించారు. శృతి మించిన ఈ ప్రేమ జంట ఆగడాల‌ను అదే బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ఓ ప్ర‌యాణికుడు త‌న కెమెరాలో బంధించి వైర‌ల్ చేశాడు.

ఈ ప్రేమ జంట ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ఈ జంట‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను నెటిజ‌న్లు డిమాండ్ చేశారు. ప‌బ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌టం మంచిది కాద‌ని, ఇతరుల‌కు భంగం క‌లిగించే విధంగా ప్ర‌వ‌ర్తించొద్ద‌ని నెటిజ‌న్లు సూచించారు.

Latest News