Site icon vidhaatha

CP Radhakrishna : మహారాష్ట్ర గవర్నర్ పదవికి సి.పి. రాధాకృష్ణన్ రాజీనామా, ఆమోదం

CP Radhakrishnan

మహారాష్ట్ర గవర్నర్ పదవికి సి.పి. రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. గుజరాత్ గవర్నర్ దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్న్ గా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఈ నెల 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సి.పి. రాధాకృష్ణన్ గెలిచారు. ఈ నెల 12న సి.పి. రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ కడ్ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించారు. ఎన్ డీ ఏ తరపున సి.పి. రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. 152 ఓట్లతో సుదర్శన్ రెడ్డిపై సి. పి. రాధాకృష్ణన్ గెలిచారు.

2023 నుంచి ఆయన పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. 2023 ఫిబ్రవరి నుంచి 2024 జూలై వరకు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు.2024 మార్చి నుంచి 2024 జూలై వరకు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ గవరన్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో ఆయన తెలంగాణకు గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2024 జూలై నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా క్ొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లొ విజయం సాధించడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు.

Exit mobile version