Maharastra Tragedy | మహారాష్ట్రలో విషాదం.. భూసి డ్యామ్‌ వరదలో కొట్టుకుపోయిన కుటుంబం..!

Maharastra Tragedy | మహారాష్ట్రలోని పుణె, ముంబై ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలోని లోనావాలలో భూసి డ్యామ్ వద్ద వాటర్ ఫాల్స్‌ను తలపించేలా వరదలు వచ్చాయి. ఆ వరదలను చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబంలోని కుటుంబ సభ్యులు వరదలో కొట్టుకుపోయారు.

Maharastra Tragedy : మహారాష్ట్రలోని పుణె, ముంబై ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలోని లోనావాలలో భూసి డ్యామ్ వద్ద వాటర్ ఫాల్స్‌ను తలపించేలా వరదలు వచ్చాయి. ఆ వరదలను చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబంలోని కుటుంబ సభ్యులు వరదలో కొట్టుకుపోయారు.

సరదాగా నీటిని చూడటానికి వెళ్లిన కుటుంబం వరద ఉధృతి పెరిగిపోవడంతో అందులోపడి కొట్టుకుపోయింది. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. కాగా, లోనావాలలోని లియాఖత్‌ అన్సారీ కుటుంబానికి చెందిన పిల్లలు, పెద్దలు 17 మంది ఆదివారం ఓ ప్రైవేటు బస్సు మాట్లాడుకుని డ్యామ్‌ దగ్గరికి వెళ్లారు. వరద తక్కువగా ఉందని మధ్యలోకి వెళ్లి ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఉధృతి పెరిగింది.

దాంతో ఆ కుటుంబంలోని 10 మంది ఆ వరదలో కొట్టుకుపోయారు. వారిలో ఐదుగురిని స్థానికులు రక్షించారు. మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాదంలో చివరగా ఐదుగురు కుటుంబ సభ్యులు చిక్కుకుని ఉండటం, అప్పటికే వరద బాగా పెరిగిపోవడం, నలుగురు పిల్లలు భయంతో బిగ్గరగా అరుపులు, కేకలు పెడుతుంటే.. ఇంటిపెద్ద వారిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించి విఫలమవడం చూపరులను కలిచివేసింది.