సుప్రీంకోర్టుకు చేరిన నీట్ వివాదం

నీట్ పరీక్షల్లో తలెత్తిన అవకతవకల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న ఎన్టీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా తొలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలైంది

  • Publish Date - June 10, 2024 / 03:50 PM IST

హైకోర్టులో 12వ తేదీన విచారణ

విధాత, హైదరాబాద్: నీట్ పరీక్షల్లో తలెత్తిన అవకతవకల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న ఎన్టీఏ నిర్ణయానికి వ్యతిరేకంగా తొలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలైంది. 1,563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలనే నిర్ణయాన్ని పిటిషన్ దారులు సుప్రీంలో సవాలు చేశారు.

ఏపీకి చెందిన నీట్ విద్యార్థులు జరుపాటే కార్తీక్‌, అబ్ధుల్లా మహ్మద్ ఫైజ్ సహా విద్యార్థి శివంగి మిశ్రా, ఇతరులు కూడా ఇదే విధంగా పిటిషన్ దాఖలు చేశారు. కార్తీక్ ప్రభృతులు తమ పిటిషన్‌ను ముందస్తు విచారణ కోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రీని అభ్యర్థించారు. మే 5న నిర్వహించనున్న పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషన్‌లో వారు డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సిట్‌తో దర్యాప్తు చేయించాలని పిటిషన్‌లో కోరారు. అటు ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఎన్టీఏ నుంచి సమాధానం కోరంది. దీనిపై ఈ నెల 12వ తేదీన విచారణ చేయనున్నట్లుగా హైకోర్టు తెలిపింది.

మరోవైపు నీట్ ఫలితాలపై పెరుగుతున్న వివాదం నేపథ్యంలో ఎన్టీఏ విద్యా మంత్రిత్వ శాఖ యూపీఎస్సీ మాజీ చైర్మభ్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఎన్టీఏ నిర్ణయాలపై వచ్చిన విమర్శలను, విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఈ ప్యానెల్ విచారించి నివేదిక సమర్పించనుంది. వివాదానికి కేంద్రమైన పరీక్ష కేంద్రాల్లోని విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సమర్ధించుకుంది. పలు రాజకీయ పార్టీలు సైతం నీట్ ఫలితాల అవకతవకలను తప్పుబట్టడంతో వివాదం ముదిరింది.

Latest News