న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. అదికూడా ఆయన పుట్టినరోజు నాడే కావడం విశేషం. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీకి లోక్‌సభ సచివాలయం సునేరీ బాగ్‌లోని 5వ బంగళాను కేటాయించింది. ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ తన తల్లి అధికారిక నివాసం 10, జన్‌పథ్‌లో తల్లితోపాటే ఉంటున్నారు. తాజాగా బంగళా కేటాయింపు నేపథ్యంలో తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు కొత్త నివాస గృహంలో పూజలు చేసి.. గృహప్రవేశం చేశారు.