Site icon vidhaatha

Mohabbat Ki Dukan | మోహబ్బత్‌ కీ దుకాన్‌.. నో హిందూ.. నో ముస్లిం!

కన్వర్‌ యాత్ర మార్గంలో దుకాణదారుల పోస్టర్లు

న్యూఢిల్లీ: ప్రజలను మతం పేరుతో చీల్చాలని చేసే ప్రయత్నాలు సాగబోమని యూపీలోని కొందరు వ్యాపారులు చాటిచెప్పారు. కావడి యాత్ర సాగే ప్రాంతాల్లో తినుబండారాల దుకాణదారులు తమ పేర్లను బోర్డుపై రాయాలన్న పోలీసు అధికారుల ఉత్తర్వులను తిరస్కరించారు. తమ దుకాణాల్లో ఆహార పదార్థాలు, తినుబండారాలు అమ్మే చోట ‘మోహబ్బత్‌ కీ దుకాన్‌.. నో హిందూ.. నో ముస్లిం’ అంటూ కొందరు రాహుల్‌ ఫోటోతో పోస్టర్లు పెట్టడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమని, రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్‌ నాయకులు అబ్దుల్‌ కలాం ఆజాద్‌, ఇర్షాద్‌ ఉల్లా అన్నారు. గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతికి ఇది పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యగా గురించి మాట్లాడాలి కానీ.. హిందువులను, ముస్లింలను విడదీయడం గురించి కాదని వారు అన్నారు. దేశాన్ని విభజించేలా యూపీ ప్రభుత్వ నిర్ణయం ఉన్నదని విమర్శించారు.

యాత్రగా కావడితో వస్తున్న భక్తులపై పలువురు ముస్లింలు పూలు చల్లి.. స్వాగతించడం విశేషం. యూపీ ప్రభుత్వ నిర్ణయంపై సోమవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన సుప్రీంకోర్టు.. పేర్లు రాయాల్సిన అవసరం లేదని, విక్రయించే ఆహార పదార్థాల సమాచారం ఇస్తే సరిపోతుందని పేర్కొన్నది

Exit mobile version