న్యూఢిల్లీ: రాజస్థాన్ లోని జోధ్ పూర్-జైసల్మేర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు(Rajasthan Road accident) ప్రమాదం చోటుచేసుకుంది. రామ్ దేవ్రాకు భక్తులతో వెళ్తున్న టెంపోను ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఆరుగురు భక్తులు(Devotees killed) మృతి చెందారు. మహిళలు, పిల్లలు సహా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
