Rolls Royce | వరద నీటిలో కదలని రోల్స్‌ రాయిస్‌..! కోట్లు పోసి కొనుగోలు చేస్తే ఏం లాభం..!

Rolls Royce | రోల్స్‌ రాయిస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన, లగర్జీ కార్లలో ఒకటి. ఇందులో రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ మోడల్‌ ఖరీదు మరీ ఎక్కువ. బేస్‌ మోడల్‌ ప్రైస్‌ రూ.6.95కోట్లతో మొదలవుతుంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌ ధర రూ.8కోట్ల వరకు ఉంటుంది. అయితే, ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటారా..? ఆగండి ఆగండి..! కోట్లుపోసి రోల్స్‌ రాయిస్‌ కారు కొన్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది.

  • Publish Date - July 4, 2024 / 09:28 AM IST

Rolls Royce | రోల్స్‌ రాయిస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన, లగర్జీ కార్లలో ఒకటి. ఇందులో రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ మోడల్‌ ఖరీదు మరీ ఎక్కువ. బేస్‌ మోడల్‌ ప్రైస్‌ రూ.6.95కోట్లతో మొదలవుతుంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌ ధర రూ.8కోట్ల వరకు ఉంటుంది. అయితే, ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటారా..? ఆగండి ఆగండి..! కోట్లుపోసి రోల్స్‌ రాయిస్‌ కారు కొన్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపై నిలిచిన చిన్నపాటి వర్షం నీటిలో నుంచి కారు ముందుకు కదలక బ్రేక్‌ డౌన్‌ అయ్యింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు ‘ఎంత ఖరీదైన కారైనా అవసరమైన సమయంలో మనం నడపగలిగేలా ఉండాలి. ఢిల్లీలో వరద నీటితో నిండిన వీధుల్లో రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారు బ్రేక్‌డౌన్‌ అవడం దురదృష్టం. కానీ, దేశ రాజధాని ఢిల్లీలో మౌలిక వసతులు ఇలా విచారకం’ అంటూ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే, వీడియో ప్రకారం.. రోడ్డుపై నిలిచిన కొద్దిపాటి నీళ్లలో మిగతా కార్లు దూసుకుపోతున్నాయి. రోల్స్‌ రాయిల్స్‌ ఘోస్ట్‌కారు మాత్రం నిలిచిపోయింది. హజార్డ్‌ లైట్లు బ్లింక్‌ కావడం కనిపించింది. మరికొందరు ద్విచక్ర వాహనాలను తోసుకుంటూ రావడం వీడియోలో కనిపించింది. ఇదంతా ఓ మారుతీ కారులో ఉన్న వ్యక్తి రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. దీన్ని చూసిన పలువురు తమదైన శైలిలో స్పందించారు. రోల్స్‌ రాయిస్‌ కారు కన్నా ఆటో కారు నయమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇలాంటి కారును వర్షాకాలంలో నడిపితే ఇలాగే జరుగుతుందని మరొకరు స్పందించారు. తక్కువ ధరకు కొన్న కార్లు వెళ్తుంటే.. లగ్జరీ కారుకు ఏమైంది? లగ్జరీ కార్లకు వరద నీటిలో వెళ్లే సామర్థ్యం ఎంత వరకు ఉంటుంది? మరొకరు ప్రశ్నించారు. లగ్జరీ కార్లు వరదనీటిలోకి వస్తే ఆటోమేటిక్‌గా బ్రేకులుపడిపోతాయని.. మెకానిక్‌ వచ్చే వరకు బ్రేకులు అలాగే పట్టేసి ఉంటాయని మరో నెటిజన్‌ పేర్కొన్నారు. మిగతా కార్లు వెళ్తుంటే లగ్జరీ కారు ఆగిపోవడం సిగ్గుచేటు అని.. అలాంటి సమయంలో ఖరీదైన కారు కొనడంలో అర్థం ఏముందని మరొకరు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. చాలారోజుల తర్వాత ఢిల్లీలో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. దాంతో వాహనదారులు పలువురు ఇబ్బందులకు గురయ్యారు.

Latest News