బాంబు పేలుళ్లకు బీజేపీ కుట్ర

నేను అంగీకరించి ఉంటే దేశమంతటా వందలాది చోట్ల బాంబులు పేలి ఉండేవి అని మాజీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ నాయకుడు యశ్వంత్‌ షిండే

  • Publish Date - May 26, 2024 / 08:33 PM IST

విధాత- నేను అంగీకరించి ఉంటే దేశమంతటా వందలాది చోట్ల బాంబులు పేలి ఉండేవి అని మాజీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ నాయకుడు యశ్వంత్‌ షిండే ఒక ఇంటర్‌వ్యూలో వెల్లడించినట్టు కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు తాజాగా ఎక్స్‌లో గుర్తు చేశారు. షిండే ఇరవై ఐదేళ్లపాటు ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసి బయటికి వచ్చారు. 2022లో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ టెర్రర్‌ క్యాంపులు నిర్వహిస్తున్నదని బయటపెట్టిన విషయం విదితమే. హిందూ మత దురహంకార భారతీయ జనతాపార్టీ 2000 సంవత్సరంలో రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలను ఆశించి ఆర్‌ఎస్‌ఎస్‌తో కలసి పెద్ద ఎత్తున బాంబింగులకు ప్రణాళిక వేసిందని షిండే ఆరోపించారు. బీజేపీ తమ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో విచక్షణారహితంగా బాంబు పేలుళ్లకు పాల్పడిందని షిండే విమర్శించారు. ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు ఐఎస్‌ఐ నుంచి నిధులు అందాయని శ్యామ్‌ ఆప్టే అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు కూడా గతంలో ఆరోపించారని మాలేగాం బాంబు పేలుళ్ల నిందితుడు దయానంద్‌ పాండే పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు.

Latest News