Stone Pillar | కర్ణాటకలో బయటపడ్డ 15వ శతాబ్దంనాటి శిలాశాసనం..! అది తిరుమల వేంకటేశ్వరస్వామికి..!

Stone Pillar | కర్ణాటకలో ఓ పురాతన కాలం నాటి శిలాశాసనం బయటపడింది. చరిత్రకారుడు, కర్ణాటక కళాశాల విద్యాశాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కేఆర్ నరసింహన్, ఔత్సాహిక చరిత్రకారుడు, రిటైర్డ్ బీఎంటీసీ డ్రైవర్ ధన్ పాల్ కలిసి కోలార్ తాలూకాలోని నాదుపల్లి గ్రామంలో ఈ ప్రాచీన రాతి స్తూపాన్ని గుర్తించారు.

  • Publish Date - July 2, 2024 / 10:53 AM IST

Stone Pillar | కర్ణాటకలో ఓ పురాతన కాలం నాటి శిలాశాసనం బయటపడింది. చరిత్రకారుడు, కర్ణాటక కళాశాల విద్యాశాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కేఆర్ నరసింహన్, ఔత్సాహిక చరిత్రకారుడు, రిటైర్డ్ బీఎంటీసీ డ్రైవర్ ధన్ పాల్ కలిసి కోలార్ తాలూకాలోని నాదుపల్లి గ్రామంలో ఈ ప్రాచీన రాతి స్తూపాన్ని గుర్తించారు. ఈ శిలాశాసనం 15వ శతాబ్దంకాలం నాటిదని భావిస్తున్నారు. శాసనంతో కూడిన స్తంభం ఓ ఆలయం వద్ద పడి ఉండడం నాదుపల్లి గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న కేఆర్ నరసింహన్, ధన్‌పాల్‌తో కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో ఆ స్తంభాన్ని వెలికి తీసి, శుభ్రం చేయించారు.

ఆ స్తూపంపై ‘కంభ సేవె’ (వైష్ణవ ఆలయానికి విరాళంగా ఓ స్తంభం) వివరాలు చెక్కినట్లు కేఆర్‌ నరసింహన్‌ తెలిపారు. కన్నడ భాషలో ఎనిమిది పంక్తులు రాసి ఉన్నాయన్నారు. ఈ స్తంభం సహజంగా ఆలయాల ముందు నిలిపే ధ్వజస్తంభం వంటిదని, దీన్ని గరుడ కంభగా పిలుస్తారని ఆయన వివరించారు. ఈ స్తూపాన్ని తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చినట్లుగా శాసనం ద్వారా తెలుస్తుందన్నారు. 1442లో ఆరసళే రాజు పేరిట ఈ శాసనం ఉందని పేర్కొన్నారు. మతపరమైన చిహ్నాలు శంఖము, గరుడ, చక్రము, నామాలు దీనిపై చెక్కారని చెప్పారు. ఈ శాసనం చాలా విలక్షణంగా ఉందని, సహజంగా శిలాశాసనాలు అడ్డంగా పొందుపరుస్తారని, కానీ నాదుపల్లిలో లభ్యమైన స్తంభంపై శాసనం మాత్రం నిలువుగా ఉందని నరసింహన్‌ వివరించారు.

Latest News