ICET 2024 | తెలంగాణలో జూన్‌ తొలి వారంలో, ఏపీలో మే తొలి వారంలో ఐసెట్‌..

  • Publish Date - April 4, 2024 / 08:22 PM IST

ICET 2024 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ICET-2024 నోటిఫికేషన్‌లు ఇప్పటికే విడుదలయ్యాయి. తెలంగాణలో జూన్‌ 5, 6 తేదీల్లో, ఆంధప్రదేశ్‌లో మే 6, 7 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. మేనేజ్‌మెంట్, ఐటీ రంగాల్లో కెరీర్‌ అవకాశాలకు ఈ ఐసెట్‌ పరీక్ష తొలి అడుగు లాంటిది. ఈ పరీక్ష రాయడానికి కావాల్సిన అర్హతలు, పరీక్ష విధానం గురించి వివరంగా తెలుకుందాం..

అర్హతలు ఎంబీఏ : 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంసీఏ : 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గమనిక : వివిధ రిజర్వేషన్‌ వర్గాలకు చెందిన అభ్యర్థులకు బ్యాచిలర్‌ డిగ్రీలో కనీసం 45 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది.

టీఎస్‌ ఐసెట్‌ టీఎస్‌ ఐసెట్‌ ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో జరుగుతుంది. మూడు విభాగాల్లో 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సెక్షన్‌-Aలో అనలిటికల్‌ ఎబిలిటీ పేరుతో డేటా సఫిషియన్సీ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నుంచి 55 ప్రశ్నలు (55 మార్కులు) అడుగుతారు.

సెక్షన్‌-Bలో మ్యాథమెటికల్‌ ఎబిలిటీలో అర్థమెటికల్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు (35 మార్కులు), అల్జీబ్రా అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ నుంచి (30 ప్రశ్నలు-30 మార్కులు), స్టాటిస్టికల్‌ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు (10 మార్కులు) ఇస్తారు. సెక్షన్‌-Cలో కమ్యూనికేషన్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 50 ప్రశ్నలు, 50 మార్కులు ఉంటాయి.

ముఖ్య తేదీలు దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 2024, ఏప్రిల్‌ 30 ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ : 2024, మే 17-20 టీఎస్‌ ఐసెట్‌ తేదీలు : 2024 జూన్‌ 5, 6 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://icet.tsche.ac.in/TSICET_HomePage.aspx

ఏపీ ఐసెట్‌ ఏపీ ఐసెట్‌ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో జరుగుతుంది. మొత్తం మూడు విభాగాల్లో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. సెక్షన్‌-Aలో అనలిటికల్‌ ఎబిలిటీ పేరుతో డేటా సఫిషియన్సీ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నుంచి 55 ప్రశ్నలు (55 మార్కులు) అడుగుతారు.

సెక్షన్‌-Bలో కమ్యూనికేషన్‌ ఎబిలిటీ 70 మార్కులకు ఉంటుంది. అందులో నాలుగు ఉప విభాగాలు ఉంటాయి. ఒకాబులరీ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు), ఫంక్షనల్‌ గ్రామర్‌ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెర్మినాలజీ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు), రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు) ఇస్తారు.

సెక్షన్‌-Cలో మ్యాథమెటికల్‌ ఎబిలిటీ మొత్తం 55 మార్కులకు ఉంటుంది. అందులో కూడా మూడు ఉప విభాగాలు ఉంటాయి. అర్థమెటికల్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు (35 మార్కులు), అల్జీబ్రా అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు (10 మార్కులు), స్టాటిస్టికల్‌ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు (10 మార్కులు) వస్తాయి.

ముఖ్య తేదీలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ : 2024, ఏప్రిల్‌ 7 ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ : 2024 ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో ఐసెట్‌ తేదీలు : 2024 మే 6, 7 తేదీల్లో పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx

Latest News