వరద ఉదృతి నుంచి క్షేమంగా కిందకు
విధాత : భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినా.. రాయగడ కోటను చూసేందుకు వెళ్లిన పర్యాటకులు.. ప్రమాదకంగా మారిన కోట మెట్లపై వరద ఉదృతి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కోట ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహ ఉదృతి మెట్ల దారిలో చాల వేగంగా కిందకు దూసుకురావడంతో మెట్లపై ఉన్న పర్యాటకులు కొట్టుకపోయే ప్రమాదం ఏర్పడింది.
అయితే పర్యాటకులు ఒకరికొకరు గట్టిగా పట్టుకోవడంతో పాటు మెట్లదారిలో ఉన్న రోప్ పైప్‌లను, పక్కనే ఉన్న మెట్ల రాళ్లను, చెట్లను ఆసరాగా చేసుకుని బతుకు జీవుడా అంటూ వరద ఉదృతిలో కొట్టుకపోకుండా బయటపడ్డారు. వరద ఉదృతి వేగానికి వారు ఏ మాత్రం పట్టు తప్పిన మెట్ల మీదుగా కిందకు కొట్టుకపోవడం, పడిపోవడం జరిగిపోయేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.