- శాఖల్లో భారీ మార్పులు.. ఉత్తర్వులు జారీ
Jammu & Kashmir | విధాత: జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగంలో భారీ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇద్దరు ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు సహా మొత్తం 230 మంది బ్యూరోక్రాట్‌లను బదిలీ చేశారు. బుధవారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బదిలీ అయినవారిలో 36 మంది ప్రత్యేక కార్యదర్శి అధికారులు, 60 మంది అదనపు కార్యదర్శులు, 85 మంది డిప్యూటీ సెక్రటరీలు, 45 మంది అండర్ సెక్రటరీలు ఉన్నారు.
ఐఏఎస్ అధికారి పర్దీప్ కుమార్ డైరెక్టర్, ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ నుంచి బదిలీ అయ్యారు. ఆయనను అటవీ శాఖలో కార్యదర్శిగా నియమించారు. ఐఎఫ్ఎస్ అధికారి అలోక్ కుమార్ మౌర్య శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు నుంచి ఫారెస్ట్, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్ విభాగానికి తిరిగి వచ్చారు.
జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు ఆసిఫ్ హమీద్ ఖాన్, వివేక్ శర్మ, బషీర్ అహ్మద్ ఖాన్, సాజాద్ హుస్సేన్‌లను జేజే స్పెషల్ ట్రిబ్యునల్ సభ్యులుగా.. అనగా.. వ్యవసాయ ఉత్పత్తి శాఖ కార్యదర్శిగా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, డెవలప్‌మెంట్ ఎక్స్‌పెండిచర్ డైరెక్టర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ప్రతినిధిగా నియమితులయ్యారు. జనవరి 28న పోలీసుశాఖలోనూ భారీ స్థాన చలనాలు జరిగాయి. ఇందులో 30 మంది ఐపీఎస్ అధికారులుసహా 75 మంది అధికారులను బదిలీ చేశారు.