Vidhya Veerappan | లోక్‌సభ ఎన్నికల బరిలో స్మగ్లర్‌ వీరప్పన్‌ తనయ విద్యా వీరప్పన్‌..!

Vidhya Veerappan | గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్ తొలిసారిగా పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. కృష్ణగిరి నియోజకవర్గం నుంచి నామ్‌ తమిళర్‌ కట్చి టికెట్‌పై బరిలోకి దిగుతున్నది. అయితే, ఆ పార్టీ ఇప్పటి వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు టికెట్‌ గెలువకపోవడం గమనార్హం. విద్యా వీరప్పన్‌ ఎన్నికల రాజకీయాల్లోకి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

  • Publish Date - April 16, 2024 / 08:45 AM IST

Vidhya Veerappan | గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్ తొలిసారిగా పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. కృష్ణగిరి నియోజకవర్గం నుంచి నామ్‌ తమిళర్‌ కట్చి టికెట్‌పై బరిలోకి దిగుతున్నది. అయితే, ఆ పార్టీ ఇప్పటి వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు టికెట్‌ గెలువకపోవడం గమనార్హం. విద్యా వీరప్పన్‌ ఎన్నికల రాజకీయాల్లోకి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యా వృత్తిరీత్యా న్యాయవాది. 2020లో తొలిసారిగా బీజేపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం బీజేపీలో యువ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఆ తర్వాత బీజేపీ బ్యాక్‌వర్డ్‌ ఫ్రంట్‌కు ఉపాధ్యక్షురాలిగా నియామకమయ్యారు. ఇటీవల బీజేపీని వీడి ఎన్‌టీకే పార్టీలో చేరారు. దాంతో ఆపార్టీ ఆమెను కృష్ణగిరి పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించింది.

విద్యా బెంగళూరులో న్యాయశాస్త్రం పూర్తి చేశారు. చదువుకున్న యువతకు ఉపాధి, రైతులకు నీటి వసతి తదితర స్థానిక సమస్యలపైనే తన దృష్టి ఉందని విద్యా తెలిపారు. అయితే, విద్యా తనకు తన తండ్రి వీరప్పన్‌ స్ఫూర్తని తెలిపింది. ఆయనను ఎందరు కరుడుగట్టిన నేరస్థుడని భావిస్తున్నా.. ఆయనతో వ్యక్తులు ఆయన గురించి చెప్పిన మాటలు విని జీవితంలో స్ఫూర్తిని పొందానని తెలిపారు. తనకు కష్టాలు వచ్చినప్పుడల్లా తన తండ్రి జీవితంలోని అవే విషయాలను గుర్తుకు తెచ్చుకుని పరిష్కారం వెతుకుంటానని తెలిపింది. విద్యా తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చదువుకు ప్రాధాన్యం ఇచ్చింది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేంది. ఈ క్రమంలో వీలైనంత వరకు చదివి న్యాయవిద్యను పూర్తి చేసింది. అయితే, బీజేపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించినా పార్టీ నుంచి సమీకరణాలు అనుకూలించలేదు. తమిళ ఉద్యమ సమయంలో ఏర్పాటైన నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీలో చేరగా కృష్ణగిరి టికెట్‌ కేటాయించింది.

Latest News