Site icon vidhaatha

ఉత్తరాఖండ్ సిల్‌క్యారా టన్నెల్ కూలీలు క్షేమం

విధాత : ఉత్తరాఖండ్ సిల్‌క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41మంది సురక్షితంగా బయట పడ్డారు. రాట్‌ హోల్‌ మైనింగ్‌ టెక్నాలాజీ గ్రాండ్‌ సక్సెస్ కావడంతో కూలీలు క్షేమంగా బయటపడ్డారు. టన్నెల్ వద్ద నేలకు నేలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయిన చోట 12మంది ర్యాట్ హోల్ మైనింగ్ కూలీలతో (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను త్రవ్వడంలో నిపుణులు) త్రవ్వకం పనులు చేపట్టారు. 24గంటల్లోగా వారు మట్టి తొలగింపును పూర్తి చేశారు. ఆ తర్వాతా కూలీలు ఉన్న చోటకు ఎంపిక చేసిన పైప్‌ను పంపించారు. ఎస్కేప్ పైపు ద్వారా కూలీలను ఒక్కోక్కరిని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. నలుగురిని బయటకు తీసుకొచ్చేందుకు 15నిమిషాల చొప్పున సమయం పట్టింది.



 



16రోజులుగా కూలీలు సొరంగంలో ఉన్నారు. వారు ఉన్న చోటికి డ్రిల్లింగ్ వేసి అమర్చిన గొట్టాల ద్వారా ఇంతకాలం వారికి డ్రైఫూట్స్‌, నీళ్లు, ఇతర ఆహారం అందించారు. ఎండోస్కోప్ కెమెరాలతో వారిని పరీశీలించారు. వాకీటాకీలు పంపించి వారితో తరుచు సంభాషించి వారిలో ధైర్యాన్ని నింపారు. కుటుంబ సభ్యులను వారితో మాట్లాడించారు. సొరంగం నుంచి ఒక్కోక్కరిని బయటకు తీసుకురాగానే వారికి తాత్కాలిక ఆహారం, చికిత్స అందించి అంబులెన్స్‌ల ద్వారా సమీపంలో సిద్ధం చేసిన 30కిలోమీటర్ల దూరంలో 41పడకల కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తరలించారు. మొత్తం 41మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు నాలుగు గంటల సమయం పడుతుంది. ఘటన స్తలానికి ఉత్తరఖండ్ సీఎం పుష్కర్ సింగ్ చేరుకుని కూలీలను బయటకు తీసుకొచ్చిన తీరును పరిశీలించారు.

Exit mobile version