- ఉన్న బల్లి జాతికి చెందిన పెద్ద జంతువు
- సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో
విధాత: కొమోడో డ్రాగన్.. ఇది భూమ్మీద జీవించే బల్లి జాతికి చెందిన భయంకరమైన అతి పెద్ద జంతువు. ఇండోనేషియా దీవుల్లో పెరిగే ఈ జంతువు తాజాగా కర్ణాటకలో కనిపించింది. కొడగు జిల్లా పొన్నంపేట్ తాలూకాలోని కుంట గ్రామంలో దిలీప్ అనే వ్యక్తి నివాస సమీపంలో ఆరు అడుగుల పొడవుతో ఏదో గోడను ఎక్కి చూస్తున్నట్టుగా ఉన్నది. ప్రస్తుతం ఈ కొమోడో డ్రాగన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తున్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద బల్లిగా గుర్తింపు పొందిన కొమోడో డ్రాగన్లు.. సాధారణంగా ఇండోనేషియా దీవుల్లో జీవిస్తాయి. ఇవి 3 మీటర్లు లేదా 9.8 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. 1910లో విదేశీ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఈ జీవిని గుర్తించారు. ఇప్పుడు ఈ జంతువును అంతరించిపోతున్న జాతి జాబితాలో చేర్చారు.
కొమోడో డ్రాగన్లు 10 అడుగుల పొడవు వరకు పెరుగుతుతాయి. 90 నుంచి 136 కిలోల బరువు ఉంటాయి. చిన్నదశలో ఇవి చెట్లలో జీవిస్తాయి. ఐదేండ్లు వచ్చేసరికి భూమిపై నివసిస్తాయి. బలీయమైన మాంసాహార జీవులైన కొమోడో డ్రాగన్లు గంటకు 19.3 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. చేపలు, జంతు కళేబరాలు ఎక్కువ తింటాయి. యువ డ్రాగన్లు సాధారణంగా బల్లులు, కీటకాలు, పక్షులు, పాముల వంటి చిన్న ఆహారం తీసుకుంటాయి.