ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనాయకుడు హిడ్మా హతం

ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్, పోలీసుల మధ్య మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని టైగర్ క్యాంప్ ప్రాంతంలో గల పుల్లగండి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మాడవి హిడ్మా సహా ఆరుగురు మృతి చెందారు.

విధాత: ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్, పోలీసుల మధ్య మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని టైగర్ క్యాంప్ ప్రాంతంలో గల పుల్లగండి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మాడవి హిడ్మా సహా ఆరుగురు మృతి చెందారు. మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా, బస్తర్ అడవుల్లో అత్యంత ప్రభావం చూపిన అగ్రనేత. ఇతని అసలు పేరు మాడవి హిడ్మా… సుక్మా ప్రాంతానికి చెందినవాడు. టీనేజ్‌లోనే మావోయిస్టు PLGAలో చేరిన హిడ్మా,PLGA 1st బెటాలియన్ కమాండర్‌గా ఎదిగాడు. అడవుల్లో అంబుష్ టాక్టిక్స్, గ్రౌండ్ ఇంటెలిజెన్స్‌లో నిష్ణాతుడు.

దంతేవాడలో జరిగిన 2010 దాడిలో హిడ్మా పాత్రపై ఇంటెలిజెన్స్ అనుమానం వ్యక్తం చేశారు. 2013 కాంగ్రెస్ కాన్వాయ్ దాడిలో కీలక పాత్ర పోషించారు. జీర్వం దాడి – 25 మే 2013 బస్తర్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు భారీ దాడి చేశారు. ఈ దాడిలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్, ఇతర నేతలు, భద్రతా సిబ్బంది సహా 30 మంది మృతి చెందారు. ఇది మావోయిస్టులు చేపట్టిన అత్యంత పెద్ద రాజకీయ లక్ష్యంపై దాడుల్లో ఒకటి.

బుర్కాపాల్ 2017, సుక్మా 2018 వరుస తీవ్ర దాడుల్లో హిడ్మాది కీలక రోల్. 2021 సుక్మా–బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో కూడా హిడ్మా ప్లానింగ్, మావోయిస్టుసెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో హిడ్మా కీలక వ్యక్తి. బస్తర్ డివిజన్‌లో హిడ్మాకే తుది నిర్ణయాధికారం. హిడ్మా అరుదుగా బయటకు వస్తాడు అతన్ని ట్రాకింగ్ చేయడం చాలా కష్టం. హిడ్మా పై పోలీసులు భారీ రివార్డు ఉంచారు. ఎన్నో ఏళ్లుగా వాంటెడ్ జాబితాలో ముందు వరుసలో హిడ్మా ఉన్నారు.