కునాల్ కమ్రాతో సంభాషణ పర్యవసానం
విధాత: అమెరికా విశ్వవిద్యాలయాల్లో అణచివేతల గురించి దేవుడెరుగు. మన దేశంలో ఏ జరుగుతున్నది? మన విశ్వవిద్యాలయాల్లో విద్యావిషయిక స్వేచ్ఛ ఉందా? ప్రముఖ కమేడియన్ కునాల్ కమ్రా రెండు రోజుల క్రితం ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యులు అపూర్వానంద్‌తో ఆడియో విడియో సంభాషణ జరిపారు.
దేశంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యావిషయిక స్వేచ్ఛ గురంచి అపూర్వానంద్ ఈ సంభాషణలో మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో సెన్సార్ షిప్ అమలవుతున్నదని ఆయన ఆ సంభాషణలో అభిప్రాయపడ్డారు. ఈ సంభాషణ బయటికి వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే అపూర్వానంద్ అమెరికా పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంది.
అపూర్వానంద్ అమెరికాలో ఒక ప్రముఖ విద్యాసంస్థలో సదస్సులో మాట్లాడవలసి వుంది. ఇది కచ్చితంగా సెన్సార్ షిప్‌ను అమలు చేయడమేనని కునాల్ కమ్రా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.