వరంగల్ ప్రతినిధి, విధాత: కాంగ్రెస్ పాలనలో వరంగల్ వైద్య హబ్ గా రూపుదిద్దుకుంటోందని, అన్ని రకాల సేవలతో ప్రత్యేకంగా నిలుస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. శుక్రవారం కాకతీయ మెడికల్ కళాశాలలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ను స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితమవకుండా.. పరిశోధనలపై దృష్టిసారించేందుకు ఈ యూనిట్ దోహదం చేస్తుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా పరిశోధనలు చేపడితే వైద్యశాస్త్ర పురోగతి మరింత సుసాధ్యం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కెఎంసీ ప్రిన్సిపల్ రామ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.