Site icon vidhaatha

Warangal: మావోయిస్టులు.. జన జీవన స్రవంతిలో కలవాలి

విధాత, వరంగల్: మావోయిస్టులు అజ్ఞాత వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపు నిచ్చారు. ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ఆమె పై ప్రభుత్వం ప్రకటించిన నాలుగు లక్షల రివార్డ్ను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా లొంగిపోయిన మహిళా మావోయిస్టుకి అందజేశారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అడవి బాట పట్టిన మావోయిస్టులు హింసను వదిలి జనం మధ్యలోకి రావాలని, లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అందుకొని మీ కుటుంబాలతో ప్రశాంతంగా కొనసాగించాల్సిందిగా పోలీస్ కమిషనర్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ లు జితేందర్ రెడ్డి, తిరుమల్, కాజిపేట్ ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version