విధాత: మహిళలతో పాటు పురుషులకూ సమాన హక్కులు ఉండాలన్న డిమాండ్ తో ఢిల్లీలో సత్యాగ్రహానికి బయలు దేరారు పురుష పుంగవులు. రేపు శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ధ సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలు బృందాలు ఢిల్లీకి బయలు దేరాయి.
మగవారి హక్కుల పరిరక్షణ పోరాట సంఘం కార్యకర్తల బృందం శుక్రవారం విశాఖ నుంచి ఢిల్లీకి పయనమైంది. స్త్రీల కోసం ప్రత్యేక కమిషన్ ఉన్నట్లే మగవారి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, మహిళల రక్షణకు షీ టీమ్స్ మాదిరిగా మగవారి రక్షణకు హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక హెల్ఫ్ లైన్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఇవే డిమాండ్లతో తెలంగాణలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ధ కార్యకర్తలు ధర్నా నిర్వహించడం తెలిసిందే.
అయితే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ధ మగవాళ్ల హక్కుల కోసం సత్యాగ్రహనికి వెళ్లిన మగవాళ్లంతా తమ ఇళ్లలో ఆడవారికి చెప్పి బయలుదేరారా లేదా..లేకపోతే ఇంటికెళ్లాకే దబిడిదిబిడే అంటూ నెటిజన్లు చురకలేస్తున్నారు.