Site icon vidhaatha

Maheshbabu: దైవం మహేష్ బాబు రూపేణా.. 4,500 మంది చిన్నారులకు ఉచితంగా హార్ద్ సర్జరీలు

Maheshbabu:

విధాత: సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో అనిపించుకున్నాడు. గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ ప‌డుతున్న చిన్నారుల‌కు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఉచితంగా ఆప‌రేష‌న్లు చేయిస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఫౌండేషన్ ద్వారా ఈ సంఖ్య సోమ‌వారంతో 4,500 దాటిన‌ట్లు ఆంధ్రా హాస్పిట‌ల్స్ ప్ర‌క‌టించింది. ఆపరేషన్ల సక్సెస్ మీట్ కు మహేష్ బాబు సతీమణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ హాజరయ్యారు.

ఏపీలో మ‌ద‌ర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలిక‌ల‌కు ఉచితంగా గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ టీకాను అందించే కార్య‌క్ర‌మాన్ని తాజాగా ప్రారంభించినట్లుగా తెలిపారు. మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్ పిల్ల‌ల హార్ట్ ఆప‌రేషన్ల‌ను విజయవంతంగా కొన‌సాగిస్తుందని వెల్ల‌డించారు. తమ అభిమాన హీరో రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అంటూ ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ 4,500హార్ట్ ఆపరేషన్స్ సక్సెస్ న్యూస్ ను సోష‌ల్ మీడియాలో తెగ పోస్టు చేస్తున్నారు. తమ హీరో చేస్తున్న స‌మాజ సేవ ప‌ట్ల వారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

తన కుమారుడు గౌతమ్ నెలలు నిండకుండానే జన్మించగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కున్న నేపథ్యం నుంచి మహేష్ బాబు హార్ట్ ఫౌండేషన్ పుట్టిందని గతంలో స్వయంగా మహేష్ బాబు వెల్లడించారు. తనకు డబ్బు ఉండి తన కొడుకు గౌతమ్ ను బ్రతికించుకున్నానని.. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆలోచన రావడంతోనే మహేష్ బాబు ఫౌండేషన్ కు శ్రీకారం చుట్టినట్లుగా మహేష్ బాబు తెలియజేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించిన మహేష్ బాబు వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడని అభిమానులు తమ హీరోను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

Exit mobile version