ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తు తెరకెక్కించిన చిత్రం బెరోజ్ (Barroz). ది గార్డియన్ ఆఫ్ డగామా ట్రెజర్ (Guardian of D’Gama’s Treasure) అనే ఓ ప్రముఖ నవల అధారంగా రూపొందిన ఈ చిత్రం గత నెలలో క్రిస్మస్‌కు థియేటర్లలోకి వచ్చి భారీ డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు ఆరెండ్ల పాటు.. రూ.150 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మాణం చేసుకున్న ఈ చిత్రం ఎటాంటి ప్రచార ఆర్బాటాలు, సందడి లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రజల ఆదరణ తక్కించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడీ సినిమా సడన్‌గా ఈ రోజు (బుధవారం) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు OTTకి వచ్చేసింది. పూర్తిగా త్రీడీ ఫార్మాట్‌లో రూపొందిన ఈ చిత్రం మనల్ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది.
కథ విషయానికి వస్తే.. 17వ సెంచరీలో పోర్చుగీసు నుంచి వచ్చిన డగామా అనే ఓ రాజకుటుంబం ఇండియాలో గోవా సమీపంలో స్థిర పడుతుంది. వారి వద్ద బరోజ్ నమ్మకస్తుడిగా పని చేస్తుంటాడు. అయితే ఓ యుద్దం నేపథ్యంలో రాజు తన నిధికి బరోజ్‌ను కాపాలాగా ఉంచి త్వరలో వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో తన మరణానంతరం భూతంగా 400 యేండ్లుగా ఆ నిధిని రక్షిస్తుంటాడు. ఆ డగామా రాజ కుటుంబ వారసులకు ఆ నిధిని అప్పజెప్పి విముక్తి పొందాలని బరోజ్ చూస్తుంటాడు. అయితే ఆ నిధిపై కొంతమంది కన్ను పడుతుంది ఆ నిధిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బరోజ్ ఏం చేశాడు. రాజు వారసురాలు ఇషాబెల్లాతో బరోజ్‌కు ఉన్న అనుబంధం ఏంటి, చివరకు నిధి ఏమయింది, దాన్ని కొట్టి వేయాలనుకున్న వారెవరు అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది.
ఎన్నో అంచనాల మధ్య, వ్యయప్రయాసలు పడి రూపొందించిన గత నెలలో క్రిస్మస్‌కు రిలీజ్ అయిన ఈ చిత్రం ఏ మాత్రం ప్రచారం లేక అసలు ఇలాంటిదో సినిమా ఉన్న సంగతి కూడా తెలియకుండానే అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇప్పుడీ సినిమా ఉన్నట్టుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ottలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. థియేటర్‌లో మిస్సయిన వారు, మంచి ఫాంటసీ, విజువల్ వండర్‌ను చూడాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బెరోజ్ (Barroz) సినిమాను మిస్ కాకుండా చూసేయండి. ముఖ్యంగా పిల్లలకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. సంగీతం, ఆర్ట్, లోకేషన్స్ కూడా అదిరిపోతాయి.