OTT Movies | ఆగ‌స్ట్ చివ‌రి వారం సంద‌డి మాములుగా లేదు.. ఏకంగా 22 సినిమాలు విడుద‌ల‌

OTT Movies | విధాత: ప్ర‌తి వారం ఇటు ఓటీటీ, అటు థియేట‌ర్‌లో ప‌లు సినిమాలు విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే థియేట‌ర్‌లో సినిమాల క‌న్నా కూడా ఓటీటీ కంటెంట్‌పై సినీ ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నారు. అయితే ఎప్ప‌టి మాదిరిగానే ఆగ‌స్ట్ చివ‌రి వారంలోను సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో డ‌బ్బింగ్ చిత్రాలే ఎక్కువ‌గా ఉన్నాయి. థియేట‌ర్‌లో చూస్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత న‌టించిన […]

  • Publish Date - August 31, 2023 / 06:27 AM IST

OTT Movies |

విధాత: ప్ర‌తి వారం ఇటు ఓటీటీ, అటు థియేట‌ర్‌లో ప‌లు సినిమాలు విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే థియేట‌ర్‌లో సినిమాల క‌న్నా కూడా ఓటీటీ కంటెంట్‌పై సినీ ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్నారు. అయితే ఎప్ప‌టి మాదిరిగానే ఆగ‌స్ట్ చివ‌రి వారంలోను సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో డ‌బ్బింగ్ చిత్రాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

థియేట‌ర్‌లో చూస్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత న‌టించిన ఖుషీ విడుద‌ల కానుంది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుండ‌గా, మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆముద శ్రీనివాస్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన‌ చిత్రం ‘నా… నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి హీరోయిన్ గా ఇందులో న‌టిస్తుంండ‌గా, సెప్టెంబరు 2న చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది.

ఒక ఓటీటీ విష‌యానికి వ‌స్తే..

నెట్‍ఫ్లిక్స్ లో మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30, లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ది బ్లూ జోన్స్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30, చూజ్ లవ్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 31, వన్ పీస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 31, ఫ్రైడే నైట్ ప్లాన్ (బాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 1, డిసెన్‍చాంట్‍ మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 1, లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ది అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 1, ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ మూవీ)- సెప్టెంబర్ 1, హ్యాపీ ఎండింగ్ (డచ్ మూవీ)- సెప్టెంబర్ 1, ఈజ్ షీ ది ఊల్ఫ్ (జపనీస్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 03న స్ట్రీమింగ్ కానుంది.

డిస్నీ ప్లస్ హాట్‍స్టార్‌లో ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 29, NCT 127: ది లాస్ట్ బాయ్స్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 30, ది ఫ్రీలాన్సర్ (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 1, హెచ్‍ఆర్ ఓటీటీ , నీరజ (మలయాళ సినిమా)- ఆగస్ట్ 28, లవ్ ఫుల్లీ యువర్స్ వేదా (మలయాళ మూవీ)- ఆగస్ట్ 29, వివాహ ఆహ్వానం (మలయాళ ఫిల్మ్)- సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ కానుంది.

జీ5లో డీడీ రిటర్న్స్-భూతాల బంగ్లా (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 1, బియో బిబ్రాత్ (బెంగాలీ సినిమా)- సెప్టెంబర్ 1, సోనీ లివ్– స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 1, ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- సెప్టెంబర్ 1, ది అల్లేస్ (అరబిక్ సినిమా)- బుక్ మై షో- సెప్టెంబర్ 1న స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తానికి ఈ వారం ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండ‌బోతుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

Latest News