Site icon vidhaatha

Aus vs Pak|పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఘోర ఓట‌మి.. ఇండియా ప‌రిస్థితి ఏంటి?

Aus vs Pak|కంగారూల సొంత గ‌డ్డ‌పై పాకిస్తాన్ విజ‌య‌భేరి మోగించింది. అడిలైడ్ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కంగారూల గడ్డపై ఏడేళ్ల తర్వాత తొలిసారి గెలుపు రుచి చూడ‌డంతో పాకిస్తానీయుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆల్‌రౌండ్ షోతో ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ హారీస్ రౌఫ్(5/29) ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. షాహిన్ షా అఫ్రిది(3/26) మూడు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ హస్‌నైన్ తలో వికెట్ తీసారు.

స్టీవ్ స్మిత్ (35; 48 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ కాగా, పాకిస్థాన్ బౌలర్లలో హారిష్ రవూఫ్ అయిదు వికెట్లు, షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా ఒక్క వికెట్ తీయడంతో ఆస్ట్రేలియా జ‌ట్టు ఏ ప‌రిస్థితులో కోలుకోలేక‌పోయింది.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్‌ను తక్కువ స్కోరుకు కట్టడిచేసింది. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 26.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.ఓపెనర్ సయీమ్ ఆయుబ్(71 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82), అబ్దుల్లా షఫీక్(69 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఐదు వికెట్లతో పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన హారిస్ రౌఫ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

ఆడిలాడ్ వేదిక‌పై పాకిస్థాన్ 28 ఏళ్ల క్రితం 1996లో విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ వేదికపై గెలుపొందింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ఈ విజయం కొంత ఊర‌ట‌నిచ్చింది అని చెప్పాలి. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఆదివారం పెర్త్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్ వరించనుంది. కాగా, మ్యాచ్ అనంతరం ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్‌లో వైఫల్యమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. పాక్ బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారని, అయితే తాము కాస్త మెరుగైన స్కోరు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఎటాకింగ్ బౌలింగ్, ఫీల్డింగ్‌తో స్కోరును కాపాడుకోవడానికి ప్రయత్నించామని, కానీ అది జరగలేదని తెలిపాడు.ఇక సొంత గ‌డ్డపై పాక్ వంటి టీమ్‌తో ఆస్ట్రేలియా ఓడిపోవ‌డంతో భార‌త్ ప‌ని మ‌రింత ఈజీగా మారుతుంద‌ని కొంద‌రు జోస్యం చెబుతున్నారు.

Exit mobile version