- 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌట్
విధాత: అహ్మదాబాద్ మొతెరా స్టేడియం వేదికగా ఆదివారం జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్-2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లను అస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేసి 240పరుగులకే ఆలౌట్ చేశారు. సరిగా 50ఓవర్లలో 240పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫిల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు శుభమన్‌గిల్-రోహిత్‌శర్మలు ఈసారి ఆశించిన శుభారంభం అందించలేకపోయారు. 4.2ఓవర్‌లో శుభమన్ గిల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.
మూడు పరుగులకే అవుటయ్యే అవకాశం తప్పినప్పటికి దాన్ని సద్వినియోగం చేసుకోలేని గిల్(4) పరుగులకే స్టార్క్ బౌలింగ్‌లో జంపా చేతికి చిక్కాడు. 30పరుగుల వద్ధ తొలి వికెట్ కోల్పోగా, ధాటిగా అడుతున్న రోహిత్ శర్మ(47) 9.4ఓవర్‌లో జట్టు స్కోర్ 76పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే కమిన్స్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్(4) కూడా అవుటవ్వగా జట్టు 11ఓవర్లలో 83పరుగులకే 3వికెట్లు కోల్పోయింది.
రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా కెన్ విలియమ్‌సన్ 578పరుగుల రికార్డును 581పరుగులతో అధిగమించాడు. తదుపరి కోహ్లీ, రాహుల్‌లు ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ఆచితూడి ఆడుతు స్కోర్‌ను ముందుకు తీసుకెలుతున్న క్రమంలో 29ఓవర్‌లో కమిన్స్ బౌలింగ్‌లో కోహ్లీ 63బంతుల్లో 54పరుగులు) బౌల్డ్ అయ్యాడు. నాల్గవ వికెట్‌కు వారిద్ధరు 87పరుగులు జోడించారు. రవీంద్రజడేజా(9) 36వ ఓవర్‌లో జట్టు స్కోర్ 178వద్ద ఐదో వికెట్‌గా వెనుతిరిగాడు.
జట్టు స్కోర్ 200గా ఉన్నప్పుడు 42వ ఓవర్‌లో 6వ వికెట్‌గా రాహుల్( 66,107బంతుల్లో) ఔటయ్యాడు. మిగిలిన నాలుగు వికెట్లను టీమిండియా 40పరుగులకు కోల్పోయి సరిగా 50ఓవర్లలో 240పరుగులకు ఆలౌట్ అయ్యింది. షమి(6), బూమ్రా(1), సూర్యకుమార్(18), కులదీప్‌యాదవ్(10) అవుట్ కాగా, సిరాజ్ 3 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. స్టార్క్ 3వికెట్లు , హెజల్ వుడ్, కమిన్స్ చెరో రెండు వికెట్లు, జంపా, మ్యాక్స్‌వెల్ చెరొక వికెట్ పడగొట్టారు.