T20 wc Ind vs Pak | భారత్–పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధర…అక్షరాలా ఒక కోటి నలభైఏడు లక్షల రూపాయలు

టి20 ప్రపంచకప్​లో భాగంగా రేపు ఆదివారం జరగబోయే ఇండియా-పాకిస్తాన్ T20 మ్యాచ్​ టిక్కెట్ ధర రీసేల్ మార్కెట్‌లో అక్షరాలా 1,46,49,276.45 ($175,400)కి స్టబ్​ హబ్​లో అమ్మకానికి పెట్టారు. స్టబ్​హబ్​ అనేది సెకండరీ మార్కెట్(Resale Market).  ఇక్కడ వినోదం, క్రీడా ఈవెంట్ టిక్కెట్‌లను చట్టబద్ధంగా బ్లాక్​లో విక్రయించవచ్చు.  ఇది నిజమేనా..? అక్షరాలా నిజం.

  • Publish Date - June 9, 2024 / 08:46 AM IST

న్యూయార్క్:   సీట్​ నెం.:30, రో నెం.: 20, సెక్షన్ నెం.​:252. ఇది రేపు ఇండియా, పాక్​ల మధ్య జరగబోయే టి20 ప్రపంచకప్​ మ్యాచ్​ స్టేడియం, ఈస్ట్​ మిడోలోని ఒక సీట్​. ఈ సీట్​ ధరనే స్టబ్​ హబ్​ రూ.కోటీ నలభై లక్షలని నిర్ణయించింది. ఏంటి దీన్లో ప్రత్యేకత? ఏమో..  అయోమయమేమిటంటే, మళ్లీ ఈ వరుస వెనకున్న 19వ రోలో టికెట్​ ధర రూ.58వేలు కాగా, ముందున్న వరుసలోని సీటు 67 వేలుగా ఉంది. స్టబ్​ హబ్​ అనేది ఒక సెకండరీ మార్కెట్​. ఇక్కడ వినోద, క్రీడా సంబంధిత ఈవెంట్ల టికెట్లను చట్టబద్ధంగా బ్లాక్​లో విక్రయించే వెసులుబాటుంది. మన దగ్గర ఏదైనా టికెట్​ ఉంటే ఇటువంటి సైట్లలో మనకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు.  దీన్లోనే మ్యాచ్​ టికెట్లు ఆ విధంగా ఎవరో లిస్ట్​ చేసారు. అయితే టికెట్​ను  ఆ ధరకు అమ్ముతారని అర్థం కాదు,  ఇది విక్రేత కోరుకునే ధర మాత్రమే. కొనాలనుకునేవారు బేరమాడుకోవచ్చు. ఇద్దరికీ ఓకే అయిన ధరకు టికెట్​ విక్రయిస్తారు. విచిత్రంగా ఇలాంటి ఇంకో సైట్ ​ వయాగోగో(Viagogo)లో సీటు నెంబరు, ఇతర వివరాలు బహిర్గతం చేయకుండానే అదే ధరకు, బహుశా అదే వ్యక్తి ద్వారా టిక్కెట్‌ను అమ్మకానికి పెట్టారు. భారత్​‌‌–పాక్​ మ్యాచ్​ టిక్కెట్లు పొందడం కష్టంగా ఉన్న ఈ సమయంలో, చాలా మంది అమెరికా, కరేబియన్​ దీవులలోని అభిమానులు ఎలాగైనా టికెట్​ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. ఇది రీసేల్ మార్కెట్‌లకు వరంగా మారింది. శుక్రవారం రాత్రి వరకు, అధికారిక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) సైట్‌లో కొన్ని టిక్కెట్‌లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బౌండరీ క్లబ్ విభాగంలో రూ.1,25,000($1,500)లకు,  డైమండ్ క్లబ్ విభాగంలో 83 లక్షలకు($10,000) మధ్య ధరలు ఉన్నాయి.

అదే వేదికపై శనివారం నేడు జరిగిన నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ICC సైట్‌లో ప్రీమియం కోసం రూ.10,000($120) మరియు ప్రీమియం క్లబ్ విభాగాలకు రూ.58వేల($700) మధ్య టిక్కెట్‌లు అందుబాటులో ఉన్నాయి. 34,000 సీట్ల సామర్థ్యం ఉన్న ఈస్ట్​ మీడో స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల డిమాండ్ 200 రెట్లు అధికంగా ఉందని ఐసిసి తెలిపింది. ఆన్​లైన్​లో చాలా ముందుగా  టిక్కెట్లు పొందిన వారిలో కొందరు రీసేల్​ మార్కెట్‌లలో భారీగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. Stubhub, Viagogo మరియు అటువంటి సైట్‌లు టికెట్ విలువ, డిమాండ్​  ఆధారంగా విక్రేత మరియు కొనుగోలుదారు నుండి కొంత రుసుము వసూలు చేసి మధ్యవర్తులుగా వ్యవహరిస్తాయి. టికెట్ కోసం $175,400ల డిమాండ్ ఉన్నప్పటికీ, సెకండరీ మార్కెట్‌లలో అడిగే ధరలు ఎక్కువగా రూ.58వేలు($700) మరియు రూ. 83వేల($1,000) మధ్య ఉన్నాయి, Stubhubలో రెండవ అత్యంత ఖరీదైన లిస్టింగ్ సెక్షన్ 101లో రూ.15 లక్షలు($18,000) కాగా, దాని తర్వాత డైమండ్ విభాగంలో ఒక సీటు రూ. 11 లక్షల 25 వేలు($13, 496)కి వచ్చింది. ఇక్కడ ఉచిత VIP పార్కింగ్ మరియు కాంప్లిమెంటరీ ‘అపరిమిత ఆహారం మరియు పానీయాలు’ (బీర్, వైన్ మరియు మద్యం)వంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయని లిస్టర్ చెప్పారు.

ఏదేమైనా, భారత్​లోనే అనుకుంటే అమెరికాలో క్రికెట్​ పిచ్చి బాగా ఎక్కువవుతోందని తెలుస్తోంది. అయితే డాలర్లలో ఖర్చుపెట్టేవారికి ఇది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. మనం భారత కరెన్సీలో చూసేసరికి కళ్లు తిరుగుతున్నాయి..అంతే.

Latest News