విధాత: కస్టమర్లను ఆకటుకునేందుకు హోటళ్లు, షాపింగ్ మాల్స్ పలు రకాల ఆకర్షణీయమైన బంపర్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అలాంటి బంపర్ ఆఫర్లలో కొన్ని వింతగా ఉంటే మరికొన్ని కొత్తగా ఉంటాయి. థాయ్ లాండ్ లో ని ఓ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో ఓ వినూత్న వింత ఆఫర్ ను ప్రకటించింది. అది కూడా కస్టమర్లు శారీరకంగా ఎంత సన్నగా ఉంటే తీసుకున్న ఫుడ్ లో అంత మేరకు డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేసింది. ఇందుకోసం రెస్టారెంట్ ముందు ఓ భారీ ఆఫర్ ప్రకటన స్టాండ్ ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెస్టారెంట్ ఏర్పాటు చేసిన ఐదు రకాల ఆఫర్లతో కూడిన గ్రిల్స్ స్టాండ్ లో 5శాతం, 10శాతం, 15శాతం, 20శాతం ఫుడ్ డిస్కౌంట్ ఆఫర్ పెట్టారు. ఆఫర్ స్టాండ్ నుంచి దాటలేని వారికి ఫుల్ ప్రైజ్ ఎంట్రీ ఏర్పాటు చేశారు. నిలువగా ఉండే ఆ గ్రిల్ స్టాండ్ లో నుంచి ఓ యువతి అతి కష్టం మీద 15శాతం గ్రిల్ మధ్య నుంచి లోనికి వెళ్లగలిగింది. 20శాతం గ్రిల్ నుంచి వెళ్లేందుకు విఫల యత్నం చేసింది. చివరకు 15శతం డిస్కౌంట్ తో సరిపెట్టుకుంది. ఇలా ఎవరికి వారు వారి శారీరక సైజ్ మేరకు డిస్కౌంట్ ల కోసం తిప్పలు పడుతు రెస్టారెంట్ వద్ధ సందడి చేస్తున్నారు.
A restaurant In Thailand #viralvideo pic.twitter.com/ttlveRqHEY
— srk (@srk9484) April 15, 2025