Apartment rules | కొన్ని కొన్ని ఏరియాల్లోని అపార్ట్‌మెంట్స్‌లో చిత్రవిచిత్రమైన రూల్స్ కనిపిస్తుంటాయి. కుక్కలు పెంచకూడదు.. మొక్కలు పెంచకూడదు.. లిఫ్ట్ సౌండ్ చేయొద్దు.. అంటూ ఏవేవో రూల్స్ పెడుతూ ఉంటారు. కొన్ని చోట్ల విజిటర్స్ వాహనాలకు అనుమతి లేదంటారు. కామన్ ఏరియాల్లో తిరిగేందుకు కూడా షరతులు విధిస్తుంటారు. బెంగళూరులో ఒక అపార్ట్‌మెంట్ అసోసియేషన్ కూడా ఇలానే ఒక రూల్ తీసుకొచ్చింది. అంతేకాదు.. దానిని ఉల్లంఘించినందుకు ఆ ఫ్లాట్ యజమానికి జరిమానా కూడా విధించింది. ఇంతకీ ఆ నిబంధన.. కారిడార్‌లో షూ రాక్ పెట్టకూడదని!
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రిస్టీజ్ సన్‌రైజ్ సిటీలో కారిడార్‌లో చెప్పుల రాక్ పెట్టినందుకుగాను ఒక అపార్టుమెంటు వాసికి 15 వేల రూపాయల జరిమానా విధించారు. కారిడార్‌లలో ఎటువంటి వస్తువులు పెట్టరాదని ప్రిస్టీజ్ సిటీలోని నార్‌వుడ్ బ్లాక్ నివాసితుల అసోసియేషన్ తీర్మానించింది. ఆ తీర్మానానికి అనుగుణంగా అందరూ చర్యలు తీసుకున్నారు. ఒక నివాసి మాత్రం కారిడార్‌లో చెప్పుల రాక్ తీయడానికి అంగీకరించలేదు. దీంతో నివాసితుల అసోసియేషన్ ఆ ఫ్లాటు యజమానికి 15 వేల రూపాయల జరిమానా విధించింది. ప్రిస్టీజ్ సిటీలో మొత్తం 1046 ఫ్లాట్లు ఉండగా అందరూ తీర్మానాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ ప్రసాద్ చెప్పారు.