Viral:
విధాత: ప్రకృతి అంతులేని వింతలు..విశేషాలకు నెలవు. మానవులు శోధించిన కొద్ధి ఎన్నో కొత్త ప్రాణులు.. వాటి జాడలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. అలాగే ప్రకృతిలో భూ చరాలు..జల చరాలు..ఉభయ చరాలుగా జీవరాశిని చూస్తున్నాం. ఇకపోతే చేపలు నీటిలో జీవించే జలచర జీవులుగా అందరికి తెలిసిందే. మరి చేపల్లో కూడా గాలిలో పక్షుల మాదిరిగా ఎగిరే చేపలుంటాయని ఎంతమందికి తెలుసు. అలాంటి ఎగిరే చేప(ఫ్లయింగ్ ఫిష్) లు కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఈ చేపలు నీటిలో నుంచి తమకు అవసరమనుకుంటే గాల్లో కొద్ధి దూరం ఎగిరి మళ్లీ నీటిలోకి వెలుతాయి. ఎగిరే చేపల వీడియో ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పక్షిలా గాల్లో రివ్వున ఎగిరిపోతున్న చేపన చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎగిరి చేపలు ఇంతదూరం గాలిలో ప్రయాణించడాన్ని నమ్మలేకపోతున్నామని అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రెక్కలు చేపలు అక్కడే ఎక్కువ
సముద్రాల్లో మాత్రమే నివసించే ఎగిరే చేపలు ఎక్కువగా కరేబియన్ దీవుల్లోని బార్బడోస్ (Barbados) ద్వీపం సమీపంలో కనిపిస్తుంటాయి. ఎగిరే చేపల జాతిని ఫ్లైయింగ్ కాడ్, కొల్లోక్వియల్లీ అని కూడా పిలుస్తారు. ఫ్లైయింగ్ ఫిషుల్లో దాదాపు 64 రకాల జాతులున్నాయి. వీటికి గాల్లో ఎగిరేందుకు అనువైన రెక్కలు ఉంటాయి. తమకు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఇవి ఒక్కసారిగా నీళ్లల్లోంచి పైకి ఎగురుతాయి. ఆ సమయంలో వాటి రెక్కలను పక్షుల రెక్కల లాగా విచ్చుకునేలా చేస్తాయి. కానీ పక్షుల లాగా రెక్కలను పైకీ, కిందకీ ఆడించలేవు. ఒకసారి గాల్లోకి ఎగిరినప్పుడు ఎంత దూరం వెళ్లగలవో అంత దూరం వెళ్లి.. తర్వాత తిరిగి నీటిలోకి జారుకోవడం ప్లయింగ్ ఫిష్ ప్రత్యేకత.