Site icon vidhaatha

Dolphins Communication | డాల్ఫిన్స్‌ వేసే ఈలల వెనుక ఇంత సినిమా ఉందా?

Dolphins Communication | సముద్ర జీవుల్లో మానవుడు అత్యంత ఆసక్తితో పరిశోధిస్తున్నవారిటో డాల్ఫిన్స్‌ కూడా ఉన్నాయి. చూడముచ్చటగా.. చెప్పిన పనులు చేసే.. ప్రజలను అలరించే డాల్ఫిన్లపై ఎడతెగని పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సారాసోటా బేలో ఒక రహస్యం వెలుగు చూసింది. ఇక్కడ ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలు.. ఒక అరుదైన ధోరణిని రికార్డ్‌ చేశారు. ఇక్కడి జలాల్లో గుంపులుగా తిరిగే బాటిల్‌నోస్‌ డాల్ఫిన్లు వెలువరించే శబ్దాలను అధ్యయనం చేశారు. సముద్ర క్షీరజమైన డాల్ఫిన్లు తెలివైనవనే అంచనాలు ఉన్నాయి. వాటిని మరింత లోతుగా అర్థం చేసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు కొత్త విషయాలు కనుగొన్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తల బృందం ఒకటి కీలక అడుగు వేసింది. డాల్ఫిన్లు ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటాయనే (Dolphins Communication) విషయాన్ని అర్థం చేసుకోవడంలో గణనీయమైన పురోగతిని వారు సాధించారు.

డాల్ఫిన్ల ఒక్కో ఈల ఒక్కో విధంగా!

ఊహాజనితంగా కాకుండా.. ఐదు దశాబ్దాల ఓపికకు అందిన ఫలితంగా ఈ ఆడియోల విశ్లేషణలు ఉన్నాయి. ఈ కృషిలో వుడ్స్‌ హోల్‌ ఓషనోగ్రాఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ (WHOI), బ్రూక్‌ఫీల్డ్ జూ షికాగోకు చెందిన సరసోటా డాల్ఫిన్ రిసెర్చ్ ప్రోగ్రామ్ (SDRP) మద్దతుతో డాల్ఫిన్ల కమ్యూనికేషన్‌ ఎలా ఉంటుందన్న విషయంలో కొత్త అంశాలు వెలుగు చూశాయి. డాల్ఫిన్లు ఈలల వంటి శబ్దాలు చేస్తాయి. అవి కూడా ఒకేలా ఉండవు.. ఒక్కో ఈల ఒక్కో విధంగా ఉంటుంది. ఇటువంటి ప్యాట్రన్స్‌ను లేలా సయీ, ఆమె సహచరులు విశ్లేషించారు. డాల్పిన్లు ఒక్కోరకంగా వేసే ఈలకు ఒక్కో అర్ధం ఉంటుందని, బహుశా అవి ఒక భాషాపరమైన లక్షణాలు కావచ్చని అంచనాకు వచ్చారు. ఇక్కడి డాల్ఫిన్లను పరిశోధకులు ఒక్కోదానిని ప్రత్యేకంగా గుర్తిస్తూ, వాటికి ప్రవర్తనల ఆ ఆధారంగా మార్కింగ్‌ చేస్తూ దశాబ్దాలుగా పరిశోధించారు. ఈ క్రమంలో వారు అత్యంత సమగ్రమైన సమద్రు క్షీరజాల శబ్దాలతో భారీ డాటాను తయారు చేశారు. వాటి ఆరోగ్యాన్ని పరీక్షించే క్రమంలో వాటి శబ్దాలను సక్షన్‌ కప్‌ హైడ్రో ఫోన్స్‌ ఆధారంగా ఈ శబ్దాలను రికార్డ్‌ చేశారు. వాటికి డిజిటల్‌ ట్యాగ్స్‌ తగిలించారు. ఈ పద్ధతుల్లో వారు హై క్వాలిటీ ఆడియోలను రికార్డు చేయగలిగారు.

రికార్డు చేసి.. వినిపించి.. వాటి స్పందనలు చూసి..

ఇలా సుమారు 300 డాల్ఫిన్ల వ్యక్తిగత శబ్దాలను రికార్డు చేసి.. వాటిలో ప్రత్యేకమైన (సిగ్నేచర్‌ విజిల్), సాధారణమైన (నాన్‌ సిగ్నేచర్‌ విజల్‌) విజిల్స్‌ను ఆర్కైవ్‌ చేశారు. వాటికి ఎస్‌డబ్ల్యూఏ, ఎస్‌డబ్ల్యూబీ అని నామకరణం చేశారు. ఎన్‌ఎస్‌డబ్ల్యూఏ ప్యాట్రన్‌ గమనిస్తే అవి పదే పదే వినిపించినట్టుగా, షేర్‌ చేసుకున్నట్టుగా, ప్రత్యేకంగా ఉన్నాయి. మొత్తంగా విజిల్స్‌ ద్వారా డాల్ఫిన్లు మాట్లాడుకుంటాయనే కనిష్ఠ ప్రాథమిక నిర్ధారణకు వచ్చేలా అవి ఉన్నాయని చెబుతున్నారు. రికార్డ్‌ చేసిన విజిల్స్‌ను మళ్లీ ప్లే చేయగా.. ప్రతి విజిల్‌కు డాల్ఫిన్లు భిన్నంగా స్పందించడాన్ని గమనించామని పరిశోధకులు తెలిపారు. కొన్ని డాల్ఫిన్లను ఎంపిక చేసుకుని, నిశ్శబ్దంగా ఉన్న సమయంలో వాటినుంచే రికార్డు చేసిన విజిల్స్‌ను వినిపించగా.. అవి కొంత గందరగోళానికి గురైనట్టు కనిపించిందని పేర్కొన్నారు. మనుషుల్లో చిన్నపిల్లలు, యుక్త వయస్కులు, వృద్ధుల గొంతు ఎలా వైవిధ్యంగా ఉంటుందో డాల్ఫిన్లలో కూడా అదే ప్యాట్రన్‌ను గుర్తించారు. మనుషులందరూ ఒక పదాన్ని ఒకే విధంగా ఎలా పలకలేరో.. డాల్పిన్లు కూడా అదే తరహాలో ఉన్నాయి. ఈ అధ్యయనం ఆధారంగా మానవుల తరహాలోనే డాల్ఫిన్లు కూడా సంభాషించుకోవడం, ఒకదానిని చూసి ఒకటి నేర్చుకోవడం చేస్తాయనేందుకు నిర్దిష్టమైన ఆధారాలు సంపాదించామని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనం ఆధారంగా లేలా సయీ బృందం మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నది. వీటిని డీకోడ్‌ చేస్తే వాటి భాషను, వాటి భావాలను అర్థం చేసుకోవడం సాధ్యపడుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం బయోఆర్‌క్సివీలో ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి..

Tardigrade: ప్రపంచంలోనే వింత జీవి ఇది.. అంతరిక్షంలోనూ జీవించగలదు
Cyber Fraud | డబ్బులెవరికీ ఊరికే రావు.. మొత్తుకుంటున్నా వినలేదు.. 2 కోట్లకు మునిగారు!
Deputy CM Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Exit mobile version