Site icon vidhaatha

King Cobra| ఫారెస్టు అక్కా..తొలి ప్రయత్నంలోనే కింగ్ కోబ్రాను పట్టేసింది

King Cobra| కేరళలో 18 అడుగుల కింగ్ కోబ్రాను కర్ర సాయంతో లేడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జీఎస్ రోషిణి బంధించారు. ఎలాంటి భయం లేకుండా కింగ్ కోబ్రాను బంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు. ఇప్పటివరకు ఆమె 500లకు పైగా పాములను బంధించారు.

అసలు ఏం జరిగింది?

తిరువనంతపురం పెప్పర నివాస ప్రాంతాల మధ్య ఉన్న కాలువలో కింగ్ కోబ్రాను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పామును పట్టుకునేందుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి రంగంలోకి దిగారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ కింగ్ కోబ్రాను ఆమె బంధించారు. ఆమె బంధించిన కోబ్రా బరువు 20 కిలోలు. పామును బంధిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఎవరీ జీఎస్ రోషిణి?

ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లోని రాఫిడ్ రెస్పాన్స్ టీమ్ ఆర్ఆర్‌టీలో రోషిణి సభ్యురాలు.మొత్తం ఐదు మందితో ఈ టీమ్ ఉంటుంది. పాములను బంధించడంతో స్థానికుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ టీమ్ పనిచేస్తుంది. రోషిణి 2017లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు. పాములను బంధించడంలో ఆమెకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ శిక్షణ ఇచ్చింది. ఎలాంటి పాములనైనా ఆమె క్షణాల్లో బంధిస్తోందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.పాములను బంధించి అటవీ ప్రాంతంలో వదిలేస్తారు.ఆమె భర్త సాజిత్ కుమార్ కోపరేటివ్ డిపార్ట్ మెంట్ లో ఆఫీసర్ గా పనిచేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు టెన్త్ చదువుతున్నారు. రెండో అబ్బాయి ఏడో తరగతి చదువుతున్నారు. రాత్రి పూట ఇంటికి వచ్చిన సమయంలో కూడా పాములను బంధించాలని ఆమెకు ఫోన్లు వస్తుంటాయి. అలాంటి సమయంలో కూడా ఆమె పాములను బంధించేందుకు వెళ్తుంటారు.

సోషల్ మీడియాలో యాక్టివ్

రోషిణి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తాను పాములు బంధించే సమయంలో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆమె బంధించిన కింగ్ కోబ్రా స్నేక్ వీడియో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయగానే వెంటనే వేలాది మంది ఈ వీడియోను చూశారు. పామును బంధించే సమయంలో కూడా కొన్ని పద్దతులుంటాయని ఆమె చెబుతున్నారు. అంతేకాదు పాములను బంధించి వాటిని అడవులకు తరలించే సమయంలో పాములు వదిలే వ్యర్థాల వాసన తట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుందని ఆమె చెబుతున్నారు. స్నేక్ క్యాచర్స్ కోసం అటవీశాఖ్క్ష ఓ కిట్ ను అందించింది. ఇందులో బ్యాగ్, పీవీసీ పైప్, హుక్ ఉంటాయి. బ్యాగులో పామును బంధించి అడవులో వదులుతారు.

Exit mobile version