Asteroid | భూమి అంతమవుతుందా..? జూలై 12న భూమివైపు దూసుకొత్తున్న గ్రహశకలం..!

Asteroid | అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు దూసుకెళ్తుంటాయి. ఇందులో కొన్ని భూమి వైపుగా దూసుకువస్తున్నాయి. దగ్గరగా వచ్చి వెళ్లిపోతున్నాయి. అయితే, ఎప్పటికైనా ఈ ఆస్టరాయిడ్ల నుంచే భూమి ముప్పు పొంచి ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

  • Publish Date - June 24, 2024 / 11:00 AM IST

Asteroid | అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు దూసుకెళ్తుంటాయి. ఇందులో కొన్ని భూమి వైపుగా దూసుకువస్తున్నాయి. దగ్గరగా వచ్చి వెళ్లిపోతున్నాయి. అయితే, ఎప్పటికైనా ఈ ఆస్టరాయిడ్ల నుంచే భూమి ముప్పు పొంచి ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తాజాగా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు కీలక విషయం వెల్లడించారు. ఇటీవల ఓ గ్రహశకలాన్ని గుర్తించామని.. అది భూమి వైపుగా దూసుకువస్తుందని పేర్కొన్నారు. దాని పరిమాణం ఎంత ఉందనే వివరాలు తెలియరాలేదని.. భూమిని ఢీకొట్టేందుకు 72శాతం ఛాన్స్‌ ఉందని తెలిపారు.

ప్రాథమిక అంచనా మేరకు ఈ ఆస్టరాయిడ్‌ 2038 జూలై 12న భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ముప్పును తప్పించేందుకు తమ వద్ద ఎలాంటి మార్గం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, అంతరిక్షంలోని గ్రహశకలాలతో భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, దాన్ని తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) మిషను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం గ్రహశకలం భూమి వైపుగా దూసుకువస్తున్నట్లుగా నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఏప్రిల్‌లో బైనియల్ ప్లానిటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టేబుల్ టాప్ ఎక్సెర్ సైజ్ నిర్వహించారు. సమీప భవిష్యత్తులో గ్రహశకలాలతో భూమికి ఎలాంటి ముప్పులేకున్నా.. గ్రహశకలాలను ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యేందుకు ఎక్సెర్ సైజ్ చేపట్టారు. దానికి సంబంధించిన ఫలితాలను ఈ నెల 20న నాసా విడుదల చేసింది. దాన్ని పరిశీలించిన జాన్ హాప్కిన్స్ శాస్త్రవేత్తలు.. భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్‌ను గుర్తించారు. అయితే, అంచనా వేసిన విధంగా ఆస్టరాయిడ్‌ భూమిని ఢీకొట్టేందుకు 72శాతం అవకాశం ఉంటే ఏం చేయాలనే దానిపై చర్చించినట్లు నాసా పేర్కొంది.

గ్రహశకలం ఢీకొన్న ప్రభావం ఓ ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా ఉంటే ఏం చేయాలనే దానిపై దృష్టి సారించినట్లు తెలిపింది. గ్రహశకలాల ముప్పును ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ఏజెన్సీలు సైతం పాల్గొనగా.. పలు సూచనలు చేశాయి. ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందకు గ్రహశకలానికి సంబంధించి మరింత సమాచారం కావాలని చెప్పాయి. భూమివైపు దూసుకొచ్చే వాటిపై స్టడీ చేసేందుకు తక్షణ ప్రయోగానికి అనుకూలంగా ఉన్న శాటిలైట్‌ను సిద్ధం చేయాలని నాసాతో పాటు అమెరికా ప్రభుత్వం అంచనాకు వచ్చింది.

శాటిలైట్‌లో టెలిస్కోప్‌ సైతం ఉండాలని తీర్మానించారు. గ్రహశకలానికి సమీపంగా వెళ్లడం, అవసరమైతే దానిపై దిగేలా శాటిలైట్‌ ఉండేలా చూడాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. భూమిపై వచ్చే గ్రహశకలాలను దారి మళ్లించేందుకు ఇప్పటికే నైనా కైనెటిక్‌ ఇంపాక్ట్‌ సాంకేతికను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో శాటిలైట్‌ సహాయంతో గ్రహశకలాన్ని ఢీకొట్టించి దాని దిశ మారేలా చేయనున్నారు. అయితే, శాస్త్రవేత్తల అంచనా మేరకు.. ప్రస్తుతం భూమికి భారీగా నష్టం కలిగించే గ్రహశకలాలు వేవు. చిన్న చిన్న వాటితో స్వల్పంగా నష్టం కలిగించే అవకాశాలు లేకపోలేదని నాసా వర్గాలు పేర్కొన్నాయి.

Latest News