Find My Device | మొబైల్‌ పోయిందా ఏం పర్లేదు..! ఇక ఈజీగా కనిపెట్టేయొచ్చు..!

  • Publish Date - April 11, 2024 / 08:08 AM IST

Find My Device | ప్రస్తుత కాలంలో మొబైల్‌ వినియోగం బాగా పెరిగింది. ఈ సాంకేతిక యుగంలో ప్రాణప్రదమైన వస్తువుగా సెల్‌ఫోన్‌ మారింది. అరగంట కూడా ఫోన్‌ లేకపోతేనే ఏదో కోల్పోయినట్లుగా చాలా మంది ఫీల్‌ అవుతుంటారు. అదే ఫోన్‌ను ఇక దొంగలు ఎత్తుకుపోయినా.. లేకపోతే ఎక్కడో పెట్టి మరిచిపోయినా ప్రాణాలు పోయినంత పనవుతుంది. అందులో ఉన్న విలువైన సమాచారం ఎక్కడ దుర్వినియోగమవుతుందోనని ఆందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా విలువైన ఫోన్‌లు పోగొట్టుకుంటే బాధపడుతుంటారు. ఇకపై వీటన్నింటికి చెక్‌ పెట్టేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ కంపెనీ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నది. మొబైల్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నా.. అది ఆఫ్‌లో ఉన్నా.. ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఆ మొబైల్‌ను కనిపెట్టేందుకు వీలున్నది.

మొబైల్‌లో నెట్‌వర్క్ లేకపోయినా, స్విచ్ఛాప్‌ చేసి ఉన్నా ఇకపై ఎలాంటి సమస్య ఉండదు. గూగుల్‌ తాజాగా ‘ఫైండ్‌ మై డివైజ్‌’ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది ఆండ్రాయిడ్‌-9 తర్వాత వర్షెన్లకు మాత్రమే సపోర్ట్‌ చేయనున్నది. ఇక యాప్‌ ఎలా పని చేస్తుందంటే.. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ నెట్‌వర్క్ లేకున్నా బ్లూటూత్ ప్రాక్సిమిటీ ద్వారా పని చేయనుంది. ఆపిల్ ఫోన్లలోని ‘ఫైండ్ మై డివైజ్’ నెట్‌వర్క్‌ తరహాలోనే ఈ యాప్‌ సైతం పని చేస్తుంది. ఆపిల్‌ యాప్‌ కంటే మరింత శక్తివంతంగా గూగుల్‌ తీసుకువచ్చింది. పిక్సెల్‌ 8, పిక్సెల్‌ ప్రో ఫోన్లు సిచ్ఛావ్‌ అయినా కూడా వాటి మొబైల్‌ కొనుగోలుదారులు ఈజీగా తమ మొబైల్‌ను గుర్తించవచ్చని గూగుల్‌ పేర్కొంది. ఇందుకోసం వాటిలో స్పెషలైజ్డ్‌ హార్డ్‌వేర్‌ను ఉపయోగించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అమెరికా, కెనడాలో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే అన్ని దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా గూగుల్‌ వివరించింది.

Latest News