ONEPLUS । వన్‌ప్లస్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ – చైనాలోని ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది మొబైల్ ఫోన్లతో పాటు, చాలా రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారుచేస్తుంది. వాటిల్లో టివీలు, స్మార్వాచీలు, పవర్‌బ్యాంకులు, ఇయర్ బడ్లు..ఇలా చాలా ఉన్నాయి. అన్నట్లు మరో ఫోన్ ఒప్పో(OPPO) కూడా వన్‌ప్లస్ కంపెనీదే. వన్‌ప్లస్ మొబైల్ ఫోన్ మాత్రం అన్నింట్లో బెస్ట్. పేరుకు చైనా ఫోనే అయినా, తన మీద ఆ ముద్ర పడకుండా నాణ్యత విషయంలో యాపిల్, సామ్‌సంగ్‌లకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇప్పటికే 20 రకాల ఫోన్లను విడుదల చేసిన వన్‌ప్లస్, తన 21వ ఫోన్‌ను మాత్రం కింగ్కాంగ్లా తయారుచేసి యాపిల్, సామ్‌సంగ్‌ల మీదకి వదలబోతోంది. అదే వన్‌ప్లస్ 13(OnePlus 13).
అక్టోబర్ 31(October 31)న చైనాలో విడుదల కానున్న ఈ ఫోన్లో అన్నీ ప్రత్యేకతలే. అవన్నీ కూడా గెలాక్సీఎస్24(Galaxy S24)), సామ్సంగ్ గొప్పగా చెప్పుఉంటున్న రాబోయే గెలాక్స్ ఎస్25 అల్ట్రా(Galaxy S25 Ultra), ఇప్పటికే విడుదలైన యాపిల్ ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్(iPhone 16Pro Max), బహుశా వచ్చే ఏడాది రాబోయే ఐఫోన్ 17(iPhone 17)లలో కూడా లేవని నిపుణుల అంచనా. విడుదలైన వాటిల్లో ఎలాగూ లేవు. కానీ లీకుల ద్వారా తెలిసిన ఎస్25 అల్ట్రా, ఐఫోన్ 17 లలో ఉండకపోవడం ఈ వన్‌ప్లస్ 13 విశేషం. ఆండ్రాయిడ్ మీద అధారపడి తను స్వంతంగా తయారుచేసుకున్న కలర్ ఓఎస్(ColorOS), ఆక్సిజన్ ఓఎస్ 15(OxygenOS)లతో వన్‌ప్లస్ 13 మొబైల్ ఫోన్ నిపుణులను, కంపెనీలను కూడా ఆకర్షిస్తోంది. ఇంకా వినియోగదారులకు పెద్దగా తెలియదు గానీ, మొత్తానికి తన ప్రత్యేకతలతో వన్‌ప్లస్ 13 సంచలనాలకు తెరతీయనుంది. ఇక ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో పరిశీలిద్దాం.
ముందుగా, ఈ బీస్ట్‌లో ఉన్న ప్రాసెసర్ – క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్(Qualcomm Snapdragon 8 Elite). క్వాల్కామ్ ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన మొబైల్ ఏఐ చిప్. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సిపియుగా చెప్పబడుతున్న క్వాల్కామ్ ఓరియన్ సిపియు(Qualcomm Oryon CPU)ను ఈ చిప్ వాడబోతోంది. ఇది ఆన్–డివైస్ జెనరేటివ్ ఏఐ(On-device Generative AI), ఎంతో క్లిష్టతరమైన మల్టీమాడల్ ఏఐ(Multi-modal AI)ని కలిగిఉన్న ప్రాసెసర్ ఇది. ఈ ప్రాసెసర్‌ను పరిచయం చేయబోతున్న మొదటి ఫోన్ ఈ వన్‌ప్లస్ 13.
ఇక మిగతా సూపర్ స్పెషాలిటీస్ విషయానికొస్తే, తెర. డిస్ప్లేను ప్రపంచంలోని దిగ్గజ డిస్ప్లే తయారీదారుల్లో ఒకటైన బిఓఈ(BOE) తయారుచేసింది. ఇది ఓరియంటల్ ఎక్స్2 8టి ఎల్టీపిఓ అమోలెడ్(Oriental X2 8T LTPO AMOLED) రెండో తరానికి చెందిన తెర. దీన్లో 6.82” అంగుళాల తెర, 1440×3168పి రిజొల్యూషన్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్‌డిఆర్10+, డాల్బీ విజన్ సౌలభ్యాలున్నాయి. కంటి రక్షణ కొరకు డిస్ప్లేమేట్ ఏ++(), టియువి రీన్‌ల్యాండ్ ఇంటెలిజెంట్ ఐ ప్రొటెక్షన్ 4.0 తో పాటు డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇవేవీ ఇతర ఫ్లాగ్షిప్ ఫోన్లలో లేవు. ఈ తెర వర్షంలో తడుస్తూ(Rain Touch 2.0), గ్లోవ్స్(Glove touch) ధరించి ఉన్నా కూడా పనిచేస్తుంది. ఈ ప్రత్యేకత కూడా ప్రపంచంలోనే మొదటిది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓస్(ColorOS)తో చైనాలో, ఆక్సిజన్ ఓఎస్(OxygenOSతో మిగతా దేశాల్లో పనిచేస్తుంది.
దీన్లో కెమెరా కూడా భారీదే. మూడు 50ఎంపీ కెమెరాలు(50 MP Tripple Camera setup)), ఒకటి ప్రధాన కెమెరా(సోనీ ఎల్వైటీ808), ఒకటి పెరిస్కోప్ కెమెరా, ఇంకోటి వైడ్ యాంగిల్ 120 డిగ్రీ కెమెరాలతో మొబైల్లోనే మొదటిసారిగా ఇవ్వనుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను స్వీడన్‌లోని ప్రముఖ కెమెరా సెన్సర్ల తయారీదారు హజిల్బ్లాడ్(Hasselblad) తయరుచేసింది. దీంతో తీసిన ఫోటోలు డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసిన ఫోటోల నాణ్యతతో సరిపోల్చవచ్చని కంపెనీ చెబుతోంది.
మెమొరీ విషయంలో కూడా వన్‌ప్లస్ 13 అన్ని ఫోన్లను దాటేసింది. 24జిబి ర్యామ్(24GB RAM), 1 టిబి(1 TB Storage) స్టోరేజితో ఓ హైఎండ్ ల్యాప్‌టాప్ స్థాయిలో ఉంది. బ్యాటరీలో మళ్లీ కొత్త సామర్థ్యానికి తెరతీసింది. భారీ 6000ఎంఏహెచ్ బ్యాటరీ(6000 mAh), 100వాట్ల కేబుల్ చార్జింగ్, 50వాట్ల వైర్లెస్ చార్జింగ్‌తో రానుంది. 0 నుండి 100శాతానికి 30 నిమిషాల్లో చార్జ్ అవుతుంది. ఈ ఫోన్ సైజు 162 X 76.5 X 8.5 ఎంఎం, బరువు 213 గ్రా.
వన్‌ప్లస్ ప్రెసిడెంట్ లూయీస్ లీ(Louis Lee) మాట్లాడుతూ, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇంతకుముందెన్నడూ చూడని ఎత్తుకు వన్‌ప్లస్ 13 ఎదుగుతుందని అన్నారు. మొత్తానికి కష్టమైనా వన్‌ప్లస్ ఓ సంచలన ఫోన్‌ను మొదటిసారి తయారుచేసిందని చెప్పుకోవచ్చు.