ONEPLUS | యాపిల్​, సామ్​సంగ్​ల బెస్ట్​ ఫోన్లను ఓడించడానికి ‘కిల్లర్​ ఫోన్’​ను దింపుతున్న వన్ ​ప్లస్​

వన్​ప్లస్​ – చైనాకు చెందిన టాప్​ మొబైల్​ ఫోన్ల కంపెనీ. వన్​ప్లస్​ ఫోన్లు భారత్​లో కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఒక పెద్ద అడుగు ముందుకేసి, సామ్​సంగ్​ గెలాక్స్​ ఎస్​ 24/రాబోయే ఎస్​25, ఐఫోన్​ 16లను దారుణంగా దెబ్బదీయగల ఫీచర్స్​తో ఓ కొత్త ఫోన్​ను ఆవిష్కరించనుంది.

ONEPLUS | యాపిల్​, సామ్​సంగ్​ల బెస్ట్​ ఫోన్లను ఓడించడానికి ‘కిల్లర్​ ఫోన్’​ను దింపుతున్న వన్ ​ప్లస్​

ONEPLUS । వన్​ప్లస్​ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్​ – చైనాలోని ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్​ కంపెనీ. ఇది మొబైల్​ ఫోన్లతో పాటు, చాలా రకాల ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులను తయారుచేస్తుంది. వాటిల్లో టివీలు, స్మార్​వాచీలు, పవర్​బ్యాంకులు, ఇయర్​ బడ్లు..ఇలా చాలా ఉన్నాయి.  అన్నట్లు మరో ఫోన్​ ఒప్పో(OPPO) కూడా వన్​ప్లస్​ కంపెనీదే. వన్​ప్లస్​ మొబైల్​ ఫోన్​ మాత్రం అన్నింట్లో బెస్ట్​. పేరుకు చైనా ఫోనే అయినా, తన మీద ఆ ముద్ర పడకుండా నాణ్యత విషయంలో యాపిల్​, సామ్​సంగ్​లకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇప్పటికే 20 రకాల ఫోన్లను విడుదల చేసిన వన్​ప్లస్​, తన 21వ ఫోన్​ను మాత్రం కింగ్​కాంగ్​లా తయారుచేసి యాపిల్​, సామ్​సంగ్​ల మీదకి వదలబోతోంది. అదే వన్​ప్లస్​ 13(OnePlus 13).

 

అక్టోబర్​ 31(October 31)న చైనాలో విడుదల కానున్న ఈ ఫోన్లో అన్నీ ప్రత్యేకతలే. అవన్నీ కూడా గెలాక్సీఎస్​24(Galaxy S24)), సామ్​సంగ్​ గొప్పగా చెప్పుఉంటున్న రాబోయే గెలాక్స్​ ఎస్​25 అల్ట్రా(Galaxy S25 Ultra), ఇప్పటికే విడుదలైన యాపిల్​ ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్(iPhone 16Pro Max)​, బహుశా వచ్చే ఏడాది రాబోయే ఐఫోన్​ 17(iPhone 17)లలో కూడా లేవని నిపుణుల అంచనా. విడుదలైన వాటిల్లో ఎలాగూ లేవు. కానీ లీకుల ద్వారా తెలిసిన ఎస్​25 అల్ట్రా, ఐఫోన్​ 17 లలో ఉండకపోవడం ఈ వన్​ప్లస్​ 13 విశేషం. ఆండ్రాయిడ్​ మీద అధారపడి తను స్వంతంగా తయారుచేసుకున్న కలర్​ ఓఎస్(ColorOS)​, ఆక్సిజన్​ ఓఎస్ 15(OxygenOS)​లతో వన్​ప్లస్​ 13 మొబైల్​ ఫోన్​ నిపుణులను, కంపెనీలను కూడా ఆకర్షిస్తోంది. ఇంకా వినియోగదారులకు పెద్దగా తెలియదు గానీ, మొత్తానికి తన ప్రత్యేకతలతో వన్​ప్లస్​ 13 సంచలనాలకు తెరతీయనుంది. ఇక ఈ ఫోన్​ ప్రత్యేకతలేంటో పరిశీలిద్దాం.

ముందుగా, ఈ బీస్ట్​లో ఉన్న ప్రాసెసర్​ – క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 8 ఎలైట్(Qualcomm Snapdragon 8 Elite)​. క్వాల్​కామ్​ ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన మొబైల్​ ఏఐ చిప్​. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సిపియుగా చెప్పబడుతున్న క్వాల్​కామ్​ ఓరియన్​ సిపియు(Qualcomm Oryon CPU)ను ఈ చిప్​ వాడబోతోంది. ఇది ఆన్​‌‌–డివైస్​ జెనరేటివ్​ ఏఐ(On-device Generative AI), ఎంతో క్లిష్టతరమైన మల్టీమాడల్​ ఏఐ(Multi-modal AI)ని కలిగిఉన్న ప్రాసెసర్​ ఇది. ఈ ప్రాసెసర్​ను పరిచయం చేయబోతున్న మొదటి ఫోన్​ ఈ వన్​ప్లస్​ 13.

 

ఇక మిగతా సూపర్​ స్పెషాలిటీస్​ విషయానికొస్తే, తెర. డిస్​ప్లేను ప్రపంచంలోని దిగ్గజ డిస్​ప్లే తయారీదారుల్లో ఒకటైన బిఓఈ(BOE) తయారుచేసింది. ఇది ఓరియంటల్​ ఎక్స్​2 8టి ఎల్​టీపిఓ అమోలెడ్(Oriental X2 8T LTPO AMOLED) రెండో తరానికి చెందిన ​తెర. దీన్లో 6.82” అంగుళాల తెర, 1440×3168పి రిజొల్యూషన్​, 120హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్​, హెచ్​డిఆర్​10+, డాల్బీ విజన్​ సౌలభ్యాలున్నాయి. కంటి రక్షణ కొరకు డిస్​ప్లేమేట్​ ఏ++(), టియువి రీన్​ల్యాండ్​ ఇంటెలిజెంట్​ ఐ ప్రొటెక్షన్​ 4.0 తో పాటు డిమ్మింగ్​ సపోర్ట్​ కూడా ఉంది. ఇవేవీ ఇతర ఫ్లాగ్​షిప్​ ఫోన్లలో లేవు. ఈ తెర వర్షంలో తడుస్తూ(Rain Touch 2.0), గ్లోవ్స్​(Glove touch) ధరించి ఉన్నా కూడా పనిచేస్తుంది. ఈ ప్రత్యేకత కూడా ప్రపంచంలోనే మొదటిది.  ఆండ్రాయిడ్​ 15 ఆధారిత కలర్​ ఓస్​(ColorOS)తో చైనాలో, ఆక్సిజన్​ ఓఎస్​(OxygenOSతో మిగతా దేశాల్లో పనిచేస్తుంది.

దీన్లో కెమెరా కూడా భారీదే. మూడు 50ఎంపీ కెమెరాలు(50 MP Tripple Camera setup)), ఒకటి ప్రధాన కెమెరా(సోనీ ఎల్​వైటీ808), ఒకటి పెరిస్కోప్​ కెమెరా, ఇంకోటి వైడ్​ యాంగిల్​ 120 డిగ్రీ కెమెరాలతో మొబైల్​లోనే మొదటిసారిగా ఇవ్వనుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్​ను స్వీడన్​లోని ప్రముఖ కెమెరా సెన్సర్ల తయారీదారు హజిల్​బ్లాడ్​(Hasselblad) తయరుచేసింది. దీంతో తీసిన ఫోటోలు డిఎస్​ఎల్​ఆర్​ కెమెరాతో తీసిన ఫోటోల నాణ్యతతో సరిపోల్చవచ్చని కంపెనీ చెబుతోంది.

 

మెమొరీ విషయంలో కూడా వన్​ప్లస్​ 13 అన్ని ఫోన్లను దాటేసింది. 24జిబి ర్యామ్(24GB RAM)​, 1 టిబి(1 TB Storage) స్టోరేజితో ఓ హైఎండ్​ ల్యాప్​టాప్​ స్థాయిలో ఉంది. బ్యాటరీలో మళ్లీ కొత్త సామర్థ్యానికి తెరతీసింది. భారీ 6000ఎంఏహెచ్​ బ్యాటరీ(6000 mAh), 100వాట్ల కేబుల్​ చార్జింగ్​, 50వాట్ల వైర్​లెస్​ చార్జింగ్​తో రానుంది. 0 నుండి 100శాతానికి 30 నిమిషాల్లో చార్జ్​ అవుతుంది. ఈ ఫోన్​ సైజు 162 X 76.5 X 8.5 ఎంఎం, బరువు 213 గ్రా.

వన్​ప్లస్​ ప్రెసిడెంట్​ లూయీస్​ లీ(Louis Lee) మాట్లాడుతూ, ఆండ్రాయిడ్​ ఫోన్లలో ఇంతకుముందెన్నడూ చూడని ఎత్తుకు వన్​ప్లస్​ 13 ఎదుగుతుందని అన్నారు. మొత్తానికి కష్టమైనా వన్​ప్లస్​ ఓ సంచలన ఫోన్​ను​ మొదటిసారి తయారుచేసిందని చెప్పుకోవచ్చు.