IPhone 17| భారత్ లో ఐఫోన్ 17 అమ్మకాలు షురూ..జనం బారులు

ఇటీవల విడుదలైన ఐ ఫోన్ 17సిరీస్ 4 అధికారిక స్టోర్ లలో భారత్ లో అందుబాటులోకి వచ్చింది. యాపిల్ స్టోర్ల ముందు ఐఫోన్ ప్రియులు తెల్లవారుజాము 3గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరిన దృశ్యాలు దేశంలో ఐఫోన్ల కు ఉన్న డిమాండ్ కు నిదర్శనంగా కనిపించింది.

IPhone 17| భారత్ లో ఐఫోన్ 17 అమ్మకాలు షురూ..జనం బారులు

 

విధాత, హైదరాబాద్ : యాపిల్ఐ  ఫోన్ 17 (Apple iPhone 17) కోసం భారత్ (India)లో కొనుగోలు దారులు(Fans) యాపిల్ స్టోర్(Apple Store)ల వద్ధ తెల్లవారజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఇటీవల విడుదలైన ఐ ఫోన్ 17సిరీస్ 4 అధికారిక స్టోర్ లలో భారత్ లో అందుబాటులోకి వచ్చింది. ముంబై బీకేసీ లోని యాపిల్ స్టోర్ ముందు ఐఫోన్ ప్రియులు తెల్లవారుజాము 3గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరిన దృశ్యాలు దేశంలో ఐఫోన్ల కు ఉన్న డిమాండ్ కు నిదర్శనంగా కనిపించింది. కొనుగోలు దారులు పరస్పరం తోపులాటకు దిగడంతో .. ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని రద్ధీని నియంత్రించారు. ఢిల్లీ, బెంగుళూరు స్టోర్‌ల ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌కు భారీ డిమాండ్ నెలకొంది.

ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ను కొనుగోలు చేసిన అమాన్‌ మెమన్‌ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశాడు. గత ఆరు నెలలుగా ఆరెంజ్ కలర్ మోడల్ వస్తుందని విని..దీనిని కొనుగోలు చేసేందుకు ఎదురుచూశానని పేర్కొన్నాడు. ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, 17 ప్రోమ్యాక్స్‌ మోడళ్లను ఇటీవల యాపిల్‌ తీసుకొచ్చింది. యాపిల్‌ ఈసారి బేస్‌ మోడళ్లను 256జీబీ వేరియంట్‌లో తీసుకొచ్చింది. ఐఫోన్‌ 17 ధర రూ.82,900 కాగా ఎయిర్‌మోడల్‌ ధర రూ.1,19,900గా కంపెనీ నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే బేస్ మోడల్ ధరను కేవలం రూ. 3,000 పెంచగా, 17 ప్రో మోడల్ ధరను మాత్రం రూ. 15,000 అధికం చేసింది.