iPhone 17 Pro Max | వాలెంటైన్స్ డే ధమాకా ఆఫర్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 17 ప్రొమ్యాక్స్
వాలెంటైన్స్ డే (Valentines Day) సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) బంపర్ ఆఫర్స్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన ఐఫోన్ 17 ప్రొమ్యాక్స్ (iPhone 17 Pro Max)పై భారీ ఆఫర్ (Offer) ప్రకటించింది.
iPhone 17 Pro Ma | ప్రేమికుల రోజు (Valentines Day) సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో ఫిబ్రవరి 14 వస్తుంది. దీంతో ప్రేమికుల రోజున తమకు ఇష్టమైన వారికి ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకోసం సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసమే అమెజాన్ (Amazon) బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన ఐఫోన్ 17 ప్రొమ్యాక్స్ (iPhone 17 Pro Max)పై భారీ ఆఫర్ (Offer) ప్రకటించింది.
ప్రీమియం సెగ్మెంట్‌లో ఎంతో క్రేజ్ ఉన్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256GB మోడల్ ధర సుమారు రూ. 1,49,900గా ఉంది. ఇది ప్రీమియం ఫోన్‌కు ఉండే సాధారణ ధరే అయినప్పటికీ, కొన్ని ఆఫర్లతో దీనిని తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే..?
కొనుగోలుదారులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కెడ్రిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొంటే.. దాదాపు రూ.7,495 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదండోయ్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ. 48,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఉదాహరణకు, మంచి కండిషన్‌లో ఉన్న ఐఫోన్ 15 మోడల్‌కు సుమారు రూ. 32,150 వరకు ఎక్స్ఛేంజ్ విలువ లభించే అవకాశం ఉంది. బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ విలువ, ఇతర చిన్న బోనస్‌లు అన్నీ కలిపితే కొనుగోలుదారులు సుమారు రూ. 39,645 వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే, పాత ఫోన్ కండిషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ విలువ మారుతుంది.
ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ఫీచర్లు..
టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ సిరీస్‌లోని 17 ప్రొమ్యాక్స్ ఫోన్‌ను గతేడాది మార్కెట్‌లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌లకు విపరీతంగా క్రేజ్ ఉంది. ఐఫోన్ 17 ప్రొమ్యాక్స్ ఫోన్‌కు 6.9 అంగులా డిస్‌ప్లే ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఇందులో 256GB, 512GB, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ వెనుక వైపు 3 కెమెరాలు ఉండగా అన్నింటికీ 48 మెగాపిక్సల్ రిజల్యూషన్‌ను ఇచ్చారు. వాటిలో ఒక కెమెరా టెలిఫొటో లెన్స్‌గా పనిచేస్తుంది. ఇంకో కెమెరా అల్ట్రా వైడ్ పనితనాన్ని కలిగి ఉంటుంది. ముందు వైపు 18 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు.ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ USB-C చార్జింగ్, MagSafe, 5G సపోర్ట్, Wi-Fi 7, Face ID, అలాగే IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ను కూడా కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ లేటెస్ట్ iOS వెర్షన్ తో వస్తుంది కనుక దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Indian couple | పెళ్లి ఖర్చుతో ఇల్లు కొని.. లివింగ్ రూమ్‌లో వివాహం చేసుకున్న జంట.. నెట్టింట ప్రశంసలు
బాలీవుడ్ ప్రొడ్యూసర్‌తో.. కిరణ్ అబ్బవరం భారీ పాన్-ఇండియా చిత్రం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram