బాలీవుడ్ ప్రొడ్యూసర్‌తో.. కిరణ్ అబ్బవరం భారీ పాన్-ఇండియా చిత్రం
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో ఓ భారీ పాన్-ఇండియా చిత్రం రూపొందేందుకు రంగం సిద్ధమవుతోంది.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో ఓ భారీ పాన్-ఇండియా చిత్రం రూపొందేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment) మరియు జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా మిథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ స్థాయి విజువల్స్, వినూత్న వరల్డ్ బిల్డింగ్‌తో రూపొందించనున్న ఈ చిత్రానికి కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో సినిమాను రూపొందించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా ప్లానింగ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక హీరోయిన్ ఎంపిక విషయంలో బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు మరియు టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై వోల్టేజ్ యాక్షన్ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram