OTT Movies | ఓటీటీల్లో ఈ వారం వినోదాల జాతర.. ‘ధురంధర్ 2’ నుంచి థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌ల వరకు భారీ లైనప్!
OTT Movies | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ సిద్ధమైంది. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా, డాక్యుమెంటరీలు ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ప్రముఖ ఓటీటీ వేదికలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భారీ బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం ఇప్పుడు సినీ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
OTT Movies | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ సిద్ధమైంది. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా, డాక్యుమెంటరీలు ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ప్రముఖ ఓటీటీ వేదికలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భారీ బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం ఇప్పుడు సినీ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మే 11 నుంచి 17 మధ్య మొత్తం 16 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదల కానుండగా.. ఒక్క మే 15న మాత్రమే 9 కంటెంట్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవడం విశేషం. వీటిలో తెలుగులో కూడా పలు ఆసక్తికర చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి.
‘ధురంధర్ 2’ ఓటీటీ ఎంట్రీకి భారీ హైప్
ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన ధురంధర్ 2 ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం మే 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం.
‘కర్తవ్య’తో క్రైమ్ థ్రిల్లర్ ట్రీట్
షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కర్తవ్య కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. సైఫ్ అలీ ఖాన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు పుల్కిత్ దర్శకత్వం వహించారు. రసిక దుగ్గల్, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
పోటీ పరీక్షల ఒత్తిడి, విద్యార్థుల మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన తమిళ సిరీస్ ఎగ్జామ్ ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నేషనల్ అవార్డు గ్రహీత ఎ. సర్గుణం రూపొందించిన ఈ సిరీస్ మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
మళ్లీ వస్తున్న ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’
గ్యాంగ్‌స్టర్ల వేట నేపథ్యంలో రూపొందిన ఇన్‌స్పెక్టర్ అవినాష్ రెండో సీజన్ కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. రణదీప్ హుఢా ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ వెబ్‌సిరీస్ మే 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
2022లో అమెరికాలో జరిగిన షాకింగ్ ఘటన ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ ది క్రాష్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ అందుబాటులోకి రానుంది.
ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న ప్రధాన కంటెంట్
నెట్‌ఫ్లిక్స్
‘ఒరు దురోహ సహచర్యతిళ్’ – మే 13
‘నెమిసిస్’ – మే 14
‘సోల్‌మేట్’ – మే 14
‘ధురంధర్ 2’ – మే 15
‘కర్తవ్య’ – మే 15
‘బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్’ – మే 15
‘మార్టిన్, లైఫ్ ఈజ్ షార్ట్’ – మే 15
‘ది క్రాష్’ – మే 15
అమెజాన్ ప్రైమ్ వీడియో
‘ఆఫ్ క్యాంపస్’ – మే 13
‘ఎగ్జామ్’ – మే 15
జియో హాట్‌స్టార్
‘ది పనిషర్: వన్ లాస్ట్ కిల్’ – మే 12
‘తుఖ్రా కా మేరే ప్యార్ సీజన్ 2’ – మే 12
‘ధురంధర్ 2’ – మే 15
‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2’ – మే 15
ఇతర ఓటీటీలో చూస్తే..
‘కాళిదాస్ 2’ – మే 12
‘తిమ్మరాజుపల్లి టీవీ’ – మే 15
‘టిఘీ’ – మే 15
మొత్తానికి ఈ వారం ఓటీటీల్లో యాక్షన్ ప్రేమికుల నుంచి థ్రిల్లర్ అభిమానుల వరకు అందరికీ సరిపోయే కంటెంట్ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ‘ధురంధర్ 2’, ‘కర్తవ్య’, ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ వంటి భారీ కంటెంట్‌లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram