Planet Alignment | ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్న అద్భుత దృశ్యం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు..

Planet Alignment | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఆరు గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రాబోతున్నాయి. ఈ ఖగోళ వింత జూన్‌ 3న కనిపించబోతున్నది. బుధుడు, అంగారకుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ గ్రహాలో ఒకే వరుసలో వచ్చి ఖగోళ ప్రియులను కనువిందు చేయబోతున్నాయి. రాత్రి తర్వాత స్పష్టంగా కనిపించకపోవచ్చని.. జూన్‌ 4న సూర్యోదయానికి 25 నిమిషాల మందు కనువిందు చేయనున్నట్లు ఖగోళ నిపుణులు పేర్కొన్నారు.

  • Publish Date - May 25, 2024 / 02:00 PM IST

Planet Alignment | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఆరు గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రాబోతున్నాయి. ఈ ఖగోళ వింత జూన్‌ 3న కనిపించబోతున్నది. బుధుడు, అంగారకుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ గ్రహాలో ఒకే వరుసలో వచ్చి ఖగోళ ప్రియులను కనువిందు చేయబోతున్నాయి. రాత్రి తర్వాత స్పష్టంగా కనిపించకపోవచ్చని.. జూన్‌ 4న సూర్యోదయానికి 25 నిమిషాల మందు కనువిందు చేయనున్నట్లు ఖగోళ నిపుణులు పేర్కొన్నారు.

ఈ గ్రహాలు నేరుగా చూసే అవకాశం కలుగనున్నది. అంగారకుడు, శని గ్రహాలు మాత్రమే మాత్రమే కంటికి కనిపించనున్నాయి. యూరెనస్, నెప్ట్యూన్‌లు భూమికి దూరంగా ఉండడంతో స్పష్టంగా కనిపించకపోవచ్చు. సూర్యుడుకి దగ్గరగా ఉండే గురు, బుధ గ్రహాలు సైతం స్పష్టంగా కనిపించేందుకు అవకాశం లేదని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. టెలిస్కోపుల సహాయంతో వీక్షించేందుకు అవకాశం ఉందనిపేర్కొన్నారు. ఈ ఖగోళ ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంది. పలు గ్రహాలు భూమి నుంచి వీక్షించే సందర్భంలో ఒకే సరళరేఖలో ఉన్నట్లు కనిపిస్తుంది.

గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్న వేర్వేరు రాశుల్లోకి ప్రవేశించిన సమయంలో ఇలాంటి అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అయితే, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అయినా.. ఇదివరకు చంద్రుడు, గురుడు, శని గ్రహాలు ఒకే వరుసలో దర్శనమిచ్చాయి. ప్లానెట్స్‌ అలైన్‌మెంట్‌ యాదృచ్చికంగా.. అనేక గ్రహాలు సూర్యుడికి ఒకే వైపు ఒకే సమయంలో వచ్చినప్పుడు జరిగే ఖగోళ ఘటన అని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫిజిక్స్ అండ్‌ ఖగోళ శాస్త్ర విభాగంలో లెక్చరర్ కేట్‌ పాటిల్‌ పేర్కొన్నారు. భూమి నుంచి చూసిన సమయంలో అవన్నీ ఒకే సరళరేఖలోకి వచ్చినట్లు కనిపిస్తుంటాయి.

గ్రహాలు అసలు ఒకే కక్ష్యలో ఏ పరిస్థితుల్లోనూ ఉండవు. కానీ, భూమిపై నుంచి చూసిన సందర్భంలో మాత్రమే అలా కనిపిస్తుంటుంది. గ్రహాల మధ్య భారీగా దూరం ఉంటుంది. కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతకు ముందు ఏప్రిల్ 8, 2024లో చివరిసారి పలు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. ఈ ఖగోళ వింతను వీక్షించేందుకు చీకటి ప్రదేశాలకు వెళ్లాలని.. అదే సమయంలో వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పష్టంగా చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Latest News