Tech tips | రాత్రిపూట వైఫై రూటర్‌ను ఆఫ్‌ చేయాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Tech tips | ఈ రోజుల్లో ప్రపంచమంతా ఇంటర్నెట్‌మయం అయిపోయింది. ఇంటర్నెట్‌ వినియోగించని మనిషే లేడు అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. స్మార్ట్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్‌నెట్ కనెక్షన్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఎక్కువమటుకు వైఫై రూటర్‌ లేని ఇల్లు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  • Publish Date - June 10, 2024 / 09:58 AM IST

Tech tips : ఈ రోజుల్లో ప్రపంచమంతా ఇంటర్నెట్‌మయం అయిపోయింది. ఇంటర్నెట్‌ వినియోగించని మనిషే లేడు అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. స్మార్ట్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్‌నెట్ కనెక్షన్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఎక్కువమటుకు వైఫై రూటర్‌ లేని ఇల్లు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే రూటర్‌ను చాలామంది వినియోగిస్తున్నా.. దాన్ని సరిగ్గా వినియోగించే విధానం మాత్రం చాలామందికి తెలియడం లేదని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా రాత్రిపూట వైఫై రూటర్‌ను ఆఫ్‌ చేయాలనే విషయం కూడా చాలామందికి తెలియదని అంటున్నారు. రాత్రిపూట వైఫై రూటర్‌ను ఆన్‌లో ఉంచడం చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. రాత్రివేళ వైఫై రూటర్‌ను ఆన్‌లో ఉంచడంవల్ల ఆరోగ్యపరంగా అనే సమస్యలు వస్తాయని, మెదడుపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

ఇవీ నష్టాలు..

రాత్రంతా వైఫై రూటర్‌ ఆన్‌లోనే ఉంటే దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్‌ రేడియషన్‌ నిరంతరంగా వెలువడుతూనే ఉంటుంది. ఇది కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా పడుకునే ప్రదేశానికి దగ్గర్లో రూటర్‌ ఉంటే బ్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి సమస్యకు కూడా ఇది కారణమవుతుందని సూచిస్తున్నారు. అందుకే పడుకునే సమయంలో కచ్చితంగా వైఫై రూటర్‌ను ఆఫ్‌ చేయాలని చెబుతున్నారు.

రాత్రంతా వైఫై రూటర్‌ని ఆన్‌లోనే ఉంచితే దాని నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తర్వాత శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యుదయస్కాంత వికిరణం శరీరంలోని వ్యాధులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా రాత్రంతా వైఫై ఆన్‌లో ఉంచడంవల్ల టెక్నికల్‌గా కూడా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా రూటర్‌ ఆన్‌లో ఉండడంవల్ల అనవసరంగా కరెంట్‌ వినియోగం పెరుగుతుందంటున్నారు. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే మీ రూటర్‌ని హ్యాక్‌ చేసే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Latest News