Site icon vidhaatha

9 నిమిషాల్లో 12 కిలోమీటర్లు..

విధాత‌(హైదరాబాద్): అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగి ప్రాణాలు నిలిపేందుకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్‌ అపోలో ఆసుపత్రికి అంబులెన్స్‌లో బాధితుడిని కేవలం 9 నిమిషాల్లో తరలించారు.

ఇందుకోసం ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. 12 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో చేరవేసి ఆ బాధితుడికి సకాలంలో వైద్యం అందేలా చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది కృషిని పలువురు అభినందిస్తున్నారు.

Exit mobile version