Site icon vidhaatha

పుట్టిన ఆడపిల్లను ఆటోలో వదిలి వెళ్లిన ఓ తల్లి

ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లి అమానుషత్వానికి పాల్పడింది. తల్లి పొత్తిళ్లలో సేదతీరాల్సిన చిన్నారిని కర్కశంగా వదిలివెళ్లింది. ఈ అమానవీయ సంఘటన జిల్లాలోని జీడిమెట్ల గాజులరామారంలో చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వైపు వెళ్లే ఆటోలో ఓ తల్లి తన బిడ్డతో కలిసి ఎక్కింది.

ఆడశిశువు అనే కారణంతో ఆ బిడ్డను వదిలించుకోవాలని భావించిన ఆ తల్లి తను ఎక్కిన ఆటోలోనే చిన్నారిని వదిలి వెళ్లిపోయింది.
కొద్దిసేపటికి బిడ్డ అరుపులు విన్న ఆటో డ్రైవర్ రాజు పోలీసులకు సమాచారం అందించగా.. వారు షాపూర్ నగర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చైల్డ్ వెల్ఫేర్ టీమ్ కు పిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version