Site icon vidhaatha

Jayadev Galla । కమిట్‌మెంట్‌లు నెరవేర్చకుంటే వేరేచోటికి తరలిపోతాం: అమరరాజా చైర్మన్‌ గల్లా జయదేవ్‌

Jayadev Galla । తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ (Amara Raja Energy & Mobility) చైర్మన్‌ గల్లా జయదేవ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆరెస్‌ ప్రభుత్వం తమకు ఇచ్చిన కమిట్‌మెంట్లను ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress government) నెరవేర్చనిపక్షంలో ప్లాంటు కెపాసిటీ విస్తరణను మరొక చోటుకు తరలించడం తప్ప తమకు మరో మార్గం లేదని అన్నారు. ఒకవైపు తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని బృందం అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో గల్లా జయదేవ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో సెల్‌ మాన్యుఫాక్చరింగ్‌ కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ (groundbreaking ceremony) చేసిన గల్లా జయదేవ్‌.. 1.5 గిగావాట్ల బ్యాటరీ ప్యాక్‌ ప్లాంట్‌ ఫేజ్‌ 1కు (Phase 1 of the battery pack plant of 1.5 GWh) ప్రారంభోత్సవం చేశారు.
రాబోయే పదేళ్ల వ్యవధిలో 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నాటి బీఆరెస్‌ ప్రభుత్వంతో అమరరాజా కంపెనీ ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ ఎంవోయూ ప్రకారం రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీకి గ్రీన్‌ ఫీల్డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీ(Greenfield manufacturing facility)లను కంపెనీ ఏర్పాటు చేస్తుంది. పారిశ్రామిక ప్రోత్సాహాకాలకు సంబంధించి గత బీఆరెస్‌ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టహామీలు ఇచ్చిందని గల్లా జయదేవ్‌ గుర్తు చేశారు. ఈ హామీలను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘మా సందేహం ఏంటంటే.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. వారు ఏం చేస్తారో మనకు తెలియదు. ఆశాభావంతో ఉన్నాం కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని (financial situation) చూస్తే వారు గత ప్రభుత్వ కమిట్‌మెంట్లను నెరవేరుస్తారా? లేదా? అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి. కమిట్‌మెంట్‌లను నెరవేర్చేందుకు వారి వద్ద నిధులు, వనరులు ఉన్నాయా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంతో తమకేమీ ఇబ్బందులు లేవని గల్లా జయదేవ్‌ చెప్పారు. ‘ఇబ్బందులు ఎదురవుతాయని అనుకోవడం లేదు కానీ.. భారతదేశంలో పరిణామాలు ఎలా మారిపోతుంటాయో చూస్తున్నదే కదా’ అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు మారిపోతే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితులు లేవు. ఆశాభావంతో ఎదురుచూస్తున్నాం. పరిస్థితులు సానుకూలంగా ఉన్నంత వరకూ ప్లాంటు విస్తరణ వేరొక చోటికి తరలించాల్సిన పరిస్థితి రాదు’ అని చెప్పారు. అన్నీ అనుకున్న ప్రణాళిక ప్రకారం సాగిపోతే, ఈవీ మార్కెట్‌ డైనమిక్స్‌ సానుకూలంగా ఉంటే అమర రాజా గ్రూపు (Amara Raja Group) రానున్న ఐదేళ్లలో ఐదు బిలియన్‌ డాలర్ల సంస్థ (USD 5 billion entity)గా ఎదుగుతుందని గల్లా జయదేవ్‌ తెలిపారు.

Exit mobile version