Site icon vidhaatha

రఘురామకృష్ణంరాజు పై హైదరాబాద్‌లో మరో ఫిర్యాదు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. ఆయనపై ఓసీ సంక్షేమ సంఘం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘కులం పేరుతో రెడ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియా, టీవీ ఛానళ్లలో కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు’’ అని ఓసీ సంక్షేమ సంఘం ఫిర్యాదులో పేర్కొంది. రఘురామకృష్ణరాజుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆ సంఘం కోరింది.

కాగా, ఎంపీ రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసింది. ఆయనపై 124(A) ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు, 153(B) వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 505 IPC బెదిరింపులకు పాల్పడటం, 120(B) కుట్రపూరిత నేరం సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ మేరకు కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసింది. అనంతరం ఆయన్ని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించింది.

Exit mobile version