Site icon vidhaatha

మరో చిరుత కలకలం.. సీసీ కెమెరాకు చిక్కిన చిరుత సంచారం

విధాత : శంషాబాద్ ఎయిర్ పోర్టు లో అటవీ అధికారులను ఐదు రోజులపాటు తిప్పలు పెట్టి బోనుకు చిక్కిన చిరుత పులి ఘటన మరువకముందే మరో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఈసారి మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం వెలుగు చూసింది. స్థానికులు చిరుత పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి సీసీ కెమెరాలలో చిరుత పులి సంచారం రికార్డు అయ్యింది. అటవీ అధికారులు చిరుత కదలికలపై నిఘా పెట్టారు.

ట్రాప్ కెమెరాల ఏర్పాటుతో చిరుత కదలికలను గుర్తించి దానిని బంధించే విషయమై ఆలోచన చేస్తున్నారు. ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ ఏరియాలోకి తునికాకు కోసం మరో పనికోసమో ఎవరు పోకూడదనీ, అటవీ ప్రాంతంలో ఏదైనా జరిగితే అటవీశాఖకు సంబంధం లేదని ఫారెస్ట్ అఫీసర్ నాగరాణి పేర్కొన్నారు. ఇబ్రహీంపూర్, బోనాల, గోవిందా పూర్, కిష్టాపూర్, పులిమామిడి, చిట్టోజ్ పల్లి, రుక్మాపూర్, రాంపూర్, కన్యారం గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి అడవిలో ఎవరూ వెళ్ళద్దని కోరారు.

Exit mobile version